ప్రభన్యూస్

Kidney Health: నడుము నొప్పా లేక కిడ్నీలు ఫెయిలా? ఈ 4 లక్షణాలతో తేడాలను తెలుసుకోండి! | లైఫ్ స్టైల్


Last Updated:

Kidney Problem: నడుము నొప్పి అనుకుని పెయిన్ కిల్లర్స్ మింగుతున్నారా? పక్కటెముకల కింద వచ్చే ఆ పదునైన నొప్పి కిడ్నీలు పూర్తిగా కుళ్ళిపోవడానికి సంకేతం కావచ్చు! మూత్రంలో మంట, జ్వరంతో కూడిన కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలపై వైద్యుల లేటెస్ట్ షాకింగ్ హెల్త్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..

News18
News18

Kidney Health: ప్రస్తుత కాలంలో నడుము నొప్పితో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వచ్చే సాధారణ నడుము నొప్పిగా భావించి చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటారు. అయితే అన్ని రకాల నడుము నొప్పులూ సాధారణమైనవి కావు. కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్లు లేదా కిడ్నీలు ఫెయిల్ అయ్యే ముందు వచ్చే తీవ్రమైన కిడ్నీ నొప్పి కూడా నడుము భాగంలోనే మొదలవుతుంది. ఈ రెండింటి మధ్య తేడాను సకాలంలో గుర్తించకపోతే.. కిడ్నీలు పూర్తిగా పాడైపోయి ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఈ రెండింటి మధ్య గల అసలైన తేడాలను, కిడ్నీ ప్రమాద సంకేతాలను ఎలా పసిగట్టాలో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

1. నొప్పి వచ్చేది ఇక్కడే…

నొప్పి శరీరంలో ఏ భాగంలో వస్తోంది అనే దాన్ని బట్టి అది నడుమా లేక కిడ్నీనా అని ఈజీగా తెలుసుకోవచ్చు. కిడ్నీలు మన వెన్నెముకకు ఇరువైపులా, పక్కటెముకల (Ribs) కింద వెనుక భాగంలో ఉంటాయి. కాబట్టి కిడ్నీలలో సమస్య ఉంటే.. నొప్పి నడుముకు కాస్త పైభాగంలో, పక్కటెముకల కింద లోపలి వైపు నుండి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది సాధారణంగా వెనుక వైపు ఒకే వైపున వస్తుంది. సాధారణ నడుము నొప్పి అనేది వెన్నెముక దిగువ భాగంలో అంటే నడుము కింద భాగంలో వస్తుంది. ఇది కండరాలు లేదా ఎముకలకు సంబంధించినది.

2. నొప్పి తీవ్రత – అది వ్యాపించే విధానం…

కిడ్నీ నొప్పి చాలా పదునుగా, విపరీతమైన పోటుతో కూడి ఉంటుంది. కిడ్నీలో రాయి కదిలినప్పుడు ఈ నొప్పి హఠాత్తుగా వస్తూ, పోతూ ఉంటుంది. ఈ నొప్పి కేవలం వెనుక భాగంలోనే ఆగకుండా.. క్రమంగా పొత్తికడుపు వైపు, తొడల సందుల వైపుకు వ్యాపిస్తుంది. బాడీ పొజిషన్ మార్చినా, పడుకున్నా ఈ నొప్పి అస్సలు తగ్గదు. ఇది కండరాల నొప్పుల లాగా నిరంతరం నిస్తేజంగా ఉంటుంది. మనం లేచి నిలబడినప్పుడు, వంగినప్పుడు లేదా బరువులు ఎత్తినప్పుడు ఈ నొప్పి పెరుగుతుంది. కూర్చున్నా, పడుకుని రెస్ట్ తీసుకున్నా నడుము నొప్పి చాలావరకు తగ్గుముఖం పడుతుంది.

3. మూత్ర విసర్జన లోపాలు…

నొప్పితో పాటు యూరిన్ లో వచ్చే మార్పులు కిడ్నీ జబ్బును స్పష్టంగా సూచిస్తాయి. కిడ్నీ నొప్పి ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన మంట లేదా నొప్పి కలుగుతుంది. తరచూ యూరిన్ కు వెళ్లాల్సి రావడం, మూత్రం రంగు మారి ముదురు పసుపు లేదా ఎరుపు రంగులోకి మారడం, యూరిన్ విపరీతమైన దుర్వాసన రావడం వంటి స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. సాధారణ నడుము నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి మూత్ర సమస్యలు అస్సలు ఉండవు.

4. ఇతర శారీరక లక్షణాలు..

ఇన్ఫెక్షన్ అలర్ట్: కిడ్నీ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు నొప్పితో పాటు విపరీతమైన జ్వరం రావడం, చలి పెట్టడం, వికారం, వాంతులు అవ్వడం వంటి లక్షణాలు తోడవుతాయి. కండరాల వల్ల వచ్చే నడుము నొప్పి ఉన్నప్పుడు జ్వరం లేదా వాంతులు వచ్చే అవకాశమే లేదు.

కిడ్నీలను కాపాడుకోవడానికి 2 ముఖ్యమైన లక్షణాలు..

నడుము నొప్పి రాగానే చాలా మంది మెడికల్ షాపులకు వెళ్లి పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను కొని మింగేస్తుంటారు. నిరంతరం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్లే కిడ్నీలు త్వరగా ఫెయిల్ అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పక్కటెముకల కింద వచ్చే నొప్పి రెండు రోజులకు మించి ఉన్నా, మూత్రంలో రంగు మారినా అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే యూరిన్ టెస్ట్, కిడ్నీ సోనోగ్రఫీ చేయించుకుని నెఫ్రాలజిస్ట్ ని సంప్రదించడం ఉత్తమం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 July 2026, 6:44 pm Digital Edition : Prabhanews
Kidney Health: నడుము నొప్పా లేక కిడ్నీలు ఫెయిలా? ఈ 4 లక్షణాలతో తేడాలను తెలుసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Jul 11, 2026 3:49 PM ISTKidney Problem: నడుము నొప్పి అనుకుని పెయిన్ కిల్లర్స్ మింగుతున్నారా? పక్కటెముకల కింద వచ్చే ఆ పదునైన నొప్పి కిడ్నీలు పూర్తిగా కుళ్ళిపోవడానికి సంకేతం కావచ్చు! మూత్రంలో మంట, జ్వరంతో కూడిన కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలపై వైద్యుల లేటెస్ట్ షాకింగ్ హెల్త్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం.. News18Kidney Health: ప్రస్తుత కాలంలో నడుము నొప్పితో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వచ్చే సాధారణ నడుము నొప్పిగా భావించి చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటారు. అయితే అన్ని రకాల నడుము నొప్పులూ సాధారణమైనవి కావు. కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్లు లేదా కిడ్నీలు ఫెయిల్ అయ్యే ముందు వచ్చే తీవ్రమైన కిడ్నీ నొప్పి కూడా నడుము భాగంలోనే మొదలవుతుంది. ఈ రెండింటి మధ్య తేడాను సకాలంలో గుర్తించకపోతే.. కిడ్నీలు పూర్తిగా పాడైపోయి ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఈ రెండింటి మధ్య గల అసలైన తేడాలను, కిడ్నీ ప్రమాద సంకేతాలను ఎలా పసిగట్టాలో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.1. నొప్పి వచ్చేది ఇక్కడే...నొప్పి శరీరంలో ఏ భాగంలో వస్తోంది అనే దాన్ని బట్టి అది నడుమా లేక కిడ్నీనా అని ఈజీగా తెలుసుకోవచ్చు. కిడ్నీలు మన వెన్నెముకకు ఇరువైపులా, పక్కటెముకల (Ribs) కింద వెనుక భాగంలో ఉంటాయి. కాబట్టి కిడ్నీలలో సమస్య ఉంటే.. నొప్పి నడుముకు కాస్త పైభాగంలో, పక్కటెముకల కింద లోపలి వైపు నుండి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది సాధారణంగా వెనుక వైపు ఒకే వైపున వస్తుంది. సాధారణ నడుము నొప్పి అనేది వెన్నెముక దిగువ భాగంలో అంటే నడుము కింద భాగంలో వస్తుంది. ఇది కండరాలు లేదా ఎముకలకు సంబంధించినది.2. నొప్పి తీవ్రత - అది వ్యాపించే విధానం...కిడ్నీ నొప్పి చాలా పదునుగా, విపరీతమైన పోటుతో కూడి ఉంటుంది. కిడ్నీలో రాయి కదిలినప్పుడు ఈ నొప్పి హఠాత్తుగా వస్తూ, పోతూ ఉంటుంది. ఈ నొప్పి కేవలం వెనుక భాగంలోనే ఆగకుండా.. క్రమంగా పొత్తికడుపు వైపు, తొడల సందుల వైపుకు వ్యాపిస్తుంది. బాడీ పొజిషన్ మార్చినా, పడుకున్నా ఈ నొప్పి అస్సలు తగ్గదు. ఇది కండరాల నొప్పుల లాగా నిరంతరం నిస్తేజంగా ఉంటుంది. మనం లేచి నిలబడినప్పుడు, వంగినప్పుడు లేదా బరువులు ఎత్తినప్పుడు ఈ నొప్పి పెరుగుతుంది. కూర్చున్నా, పడుకుని రెస్ట్ తీసుకున్నా నడుము నొప్పి చాలావరకు తగ్గుముఖం పడుతుంది.3. మూత్ర విసర్జన లోపాలు...నొప్పితో పాటు యూరిన్ లో వచ్చే మార్పులు కిడ్నీ జబ్బును స్పష్టంగా సూచిస్తాయి. కిడ్నీ నొప్పి ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన మంట లేదా నొప్పి కలుగుతుంది. తరచూ యూరిన్ కు వెళ్లాల్సి రావడం, మూత్రం రంగు మారి ముదురు పసుపు లేదా ఎరుపు రంగులోకి మారడం, యూరిన్ విపరీతమైన దుర్వాసన రావడం వంటి స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. సాధారణ నడుము నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి మూత్ర సమస్యలు అస్సలు ఉండవు.4. ఇతర శారీరక లక్షణాలు..ఇన్ఫెక్షన్ అలర్ట్: కిడ్నీ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు నొప్పితో పాటు విపరీతమైన జ్వరం రావడం, చలి పెట్టడం, వికారం, వాంతులు అవ్వడం వంటి లక్షణాలు తోడవుతాయి. కండరాల వల్ల వచ్చే నడుము నొప్పి ఉన్నప్పుడు జ్వరం లేదా వాంతులు వచ్చే అవకాశమే లేదు.కిడ్నీలను కాపాడుకోవడానికి 2 ముఖ్యమైన లక్షణాలు..నడుము నొప్పి రాగానే చాలా మంది మెడికల్ షాపులకు వెళ్లి పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను కొని మింగేస్తుంటారు. నిరంతరం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్లే కిడ్నీలు త్వరగా ఫెయిల్ అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పక్కటెముకల కింద వచ్చే నొప్పి రెండు రోజులకు మించి ఉన్నా, మూత్రంలో రంగు మారినా అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే యూరిన్ టెస్ట్, కిడ్నీ సోనోగ్రఫీ చేయించుకుని నెఫ్రాలజిస్ట్ ని సంప్రదించడం ఉత్తమంLocation :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link