Last Updated:
బిగ్ బాస్ 10 రసవత్తరంగా సాగుతోంది. తొలి వారమే బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్‌లో అడుగుపెట్టిన మొత్తం 16 మంది కంటెస్టెంట్లను డైరెక్ట్‌గా నామినేషన్స్‌లోకి నెట్టేసి సభ్యులందరికీ షాకిచ్చాడు.
బుల్లితెర ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచేందుకు నెట్టింట విపరీతమైన క్రేజ్ ఉన్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ (Bigg Boss Telugu 10) గ్రాండ్‌గా మొదలైంది. లాంచ్ అయిన మొదటి రోజే హౌస్‌లో గొడవలు, వివాదాలతో వాతావరణం అమాంతం వేడెక్కింది. దీనికి తోడు మునుపెన్నడూ లేని విధంగా బిగ్ బాస్ తొలివారమే అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్‌లో అడుగుపెట్టిన మొత్తం 16 మంది కంటెస్టెంట్లను డైరెక్ట్‌గా నామినేషన్స్‌లోకి నెట్టేసి సభ్యులందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో కంటెస్టెంట్ల అదృష్టాన్ని పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లో పెట్టేశారు. ‘అగ్నిపరీక్ష’ టాస్క్ ద్వారా కామనర్స్ తమ స్థానాలను సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా, బయట ఓటింగ్ సరళిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తొలిరోజు ఓటింగ్ ట్రెండ్స్ గమనిస్తే టాప్-6లో కేవలం పురుష కంటెస్టెంట్లు మాత్రమే ఉండటం గమనార్హం. మొత్తం ఓట్లలో ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు వీరే దక్కించుకుంటున్నారు.

