“మన దగ్గర రెగ్యులర్‌గా బిజినెస్ చేస్తూ నెలకు కనీసం రూ.10,000 బిజినెస్ ఇచ్చేవాళ్లను అడ్వాన్స్ కస్టమర్స్ లేదా కాంట్రాక్చువల్ కస్టమర్స్ కింద ఎన్రోల్ చేసుకుంటాం. ఈ కస్టమర్లకే కాంట్రాక్చువల్ టారిఫ్ వర్తిస్తుంది. భవిష్యత్తులో బిజినెస్ ఎక్స్‌పాన్షన్ ఉంటుందని భావిస్తే, కొంత ఆపర్చునిటీ కూడా ఇస్తాం” అని జనార్ధన్ రెడ్డి వివరించారు. ఇండియా పోస్ట్ పార్శిల్ కాంట్రాక్చువల్ ఛార్జీలు చూస్తే ఈ సర్వీస్ ఛార్జీలు పార్శిల్ బరువు, అది వెళ్లే ప్రాంతాన్ని బట్టి మారతాయి. 500 గ్రాముల వరకు ఉండే పార్శిల్స్‌కు లోకల్‌కు రూ.27, అదే రాష్ట్రంలో పంపితే రూ.31, జోన్/మెట్రోకు రూ.34, ఇతర రాష్ట్రాలకు రూ.35 ఛార్జీ ఉంటుంది. 501 నుంచి 1000 గ్రాముల వరకు బరువున్న పార్శిల్స్‌కు వరుసగా రూ.31, రూ.44, రూ.51, రూ.57 ఛార్జీలు ఉంటాయి. 501 గ్రాముల నుంచి 1 కిలో వరకు బరువు ఉంటే లోకల్‌కు రూ.31, అదే రాష్ట్రంలో రూ.44, జోన్/మెట్రోకు రూ.51, ఇతర రాష్ట్రాలకు రూ.57 ఛార్జీ ఉంటుంది. 1.001 కిలోల నుంచి 1.5 కిలోల వరకు లోకల్‌కు రూ.36, అదే రాష్ట్రంలో రూ.58, జోన్/మెట్రోకు రూ.70, ఇతర రాష్ట్రాలకు రూ.80 ఛార్జీ ఉంటుంది. 1.501 కిలోల నుంచి 2 కిలోల వరకు లోకల్‌కు రూ.45, అదే రాష్ట్రంలో రూ.80, జోన్/మెట్రోకు రూ.100, ఇతర రాష్ట్రాలకు రూ.115 ఛార్జీ ఉంటుంది. 2.001 కిలోల నుంచి 3 కిలోల వరకు లోకల్‌కు రూ.57, అదే రాష్ట్రంలో రూ.100, జోన్/మెట్రోకు రూ.125, ఇతర రాష్ట్రాలకు రూ.145 ఛార్జీ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
