Last Updated:
చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, పట్టేయడం, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బందులు ఎందుకు వస్తాయో తెలుసుకోండి. అధిక బరువు, పాత గాయాలు వంటి కారణాలతో మోకాళ్లు త్వరగా అరిగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.
ఒకప్పుడు మోకాళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగా భావించేవారు. కానీ ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల వయసులోనే చాలామంది మోకాళ్ల నొప్పులు, పట్టేయడం, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బందులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, పాత గాయాలు వంటి అనేక కారణాలు చిన్న వయసులోనే మోకాళ్లపై ప్రభావం చూపుతున్నాయి.

