Last Updated:
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
దేశీయ కమోడిటీ మార్కెట్లో బుధవారం ఉదయం బంగారం స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు కొంచెం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి వంటి అంశాల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో గణనీయమైన కదలిక కనిపించింది. బుధవారం ఉదయం 9:05 గంటలకు Moneycontrol వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,448 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.131 తగ్గింది. ఇక వెండి ధరల్లో మాత్రం స్వల్ప పెరుగుదల కనిపించింది. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.2,39,650 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై ఏకంగా రూ.268 పెరుగుదల నమోదైంది. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి మరోసారి బలమైన స్థాయిలో ట్రేడవుతోంది.

