రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్ల గురించి ముచ్చటించిన నయనతార, తన తొలి సంపాదన ఎంత అనే విషయాన్ని వెల్లడించింది. సినీ రంగంలోకి రాకముందు మోడలింగ్ చేసిన ఆమె, ఒక ఫ్యాషన్ కార్యక్రమం, మ్యాగజైన్ కవర్ షూట్ కోసం మొదటిసారి పనిచేశారు. ఆ తొలి అసైన్మెంట్ కోసం ఆమె అందుకున్న పారితోషికం కేవలం రూ. 2,000 మాత్రమే అని చెప్పింది.
