ఇప్పుడు అమ్మా కిచెన్‌కు పాట్నాలో రెండు డైన్-ఇన్ అవుట్‌లెట్లు ఉన్నాయి. 30 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. రోజుకు దాదాపు 350 ఆన్‌లైన్ ఆర్డర్లు వస్తున్నాయి. ఇటీవల ది బెటర్ ఇండియా ప్రచురించిన కథనాల ప్రకారం, ఏడాదికి సుమారు రూ.2.5 కోట్ల ఆదాయం వస్తోంది. ఒకప్పుడు రూ.20కే భోజనం ఇచ్చిన ఈ బిజినెస్ ఇప్పుడు పూర్తి స్థాయి ఫుడ్ బ్రాండ్‌గా ఎదిగింది. ప్రస్తుతం అవుట్‌లెట్లలో భోజనం ధరలు రూ.100 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. దేవ్ని దేవికి బిజినెస్‌లో ఎలాంటి అధికారిక శిక్షణ లేదు. అయితే, ఉమ్మడి కుటుంబంలో దశాబ్దాల పాటు వంట చేయడం ఆమెకు ఎన్నో విషయాలు నేర్పింది. ఎంతమందికి ఎంత ఆహారం కావాలి, సరుకులను ఎలా ప్లాన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో వంటను ఎలా నిర్వహించాలి అన్నది ఆమెకు అనుభవంతో వచ్చేసింది. దేవ్ని దేవికి 16 ఏళ్ల వయసులో పెళ్లయింది. ఆ తర్వాత బీహార్‌లోని 25 మంది సభ్యులున్న కుటుంబంలో భాగమయ్యారు. ప్రతిరోజూ పెద్ద మొత్తంలో వంట చేయడం, ఇంటి వంటగదిని చూసుకోవడం ఆమె బాధ్యతగా ఉండేది. తర్వాత ఇదే అనుభవం ఆమె బిజినెస్‌కు బలమైన పునాదిగా మారింది. (image: amma kitchen)
