Last Updated:
GSB Seva Mandal Ganpati: ముంబైలో గణేశోత్సవ సందడి మొదలుకానుంది. సయాన్ ఈస్ట్‌లోని GSB సేవా మండల్ 72వ మహా గణపతి ఉత్సవాలను సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈసారి మహా గణపతిని 66 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, 335 కిలోలకు పైగా వెండి ఆభరణాలతో అలంకరించనుండగా.. భక్తుల భద్రత, మండలి ఆస్తుల కోసం ఏకంగా రూ.703.27 కోట్ల బీమా రక్షణను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 12న రాత్రి 8 గంటలకు మహా గణపతి తొలి దర్శనం నిర్వహించనున్నారు.
గణేశోత్సవానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ముంబైలోని సయాన్ ఈస్ట్‌లో ఉన్న GSB సేవా మండల్ 72వ మహా గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రాచీన వైదిక సంప్రదాయాలు, విస్తృతమైన పూజా కార్యక్రమాలతో పాటు పర్యావరణహిత విధానాలకు కూడా ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

