Last Updated:
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే Gen Z యువత.. కెరీర్‌కు ఉపయోగపడే సీనియర్లు, నిపుణులతో నెట్‌వర్కింగ్ చేసుకోవడంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. LinkedIn తాజా నివేదిక ప్రకారం, భారత్‌లో ఏకంగా 83% Gen Z ప్రొఫెషనల్స్ కెరీర్‌కు సహాయపడగల వ్యక్తులను సంప్రదించేందుకు భయపడుతున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా ‘ఇతరులు ఏమనుకుంటారో’ అనే భయమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పుణ్యమా అని అందరూ నిత్యం ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు. అయితే, బయటి ప్రపంచంతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండే ఈ తరం యువత.. వృత్తిపరమైన విషయానికి వచ్చేసరికి మాత్రం కొంచెం వెనకడుగు వేస్తోంది. ఇతరులు ఏమనుకుంటారోననే భయం (Fear of being judged) కారణంగా, తమ కెరీర్‌కు ఎంతో కొంత సహాయం చేయగల సీనియర్లు లేదా నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి, నెట్‌వర్కింగ్ చేసుకోవడానికి నేటి జెన్-జెడ్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా భయపడుతున్నట్లు తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. బుధవారం విడుదలైన ఈ నివేదిక ఉద్యోగ రంగంలో యువత ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలను వెలుగులోకి తెచ్చింది.

