ముఖ్యంగా మసాలాలు బాగా కలిసేలా నెమ్మదిగా ఉడికిస్తే కర్రీ మంచి రుచితో పాటు చక్కటి సువాసన వస్తుంది. ఈ కర్రీ తయారీకి ముందుగా శుభ్రం చేసిన పీతలు తీసుకోవాలి. వీటితో పాటు నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ ఆకులు, ఎండు మిర్చి అవసరం.
