కార్తీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్ 2’. నాలుగేళ్ళ ముందు ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అరివీర భయంకర హిట్టు కొట్టిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. పీ.ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్.జే సూర్య ప్రతినాయకుడిగా కనిపించనునున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కానుంది.
Source link
Sardar 2 Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'సర్దార్-2' మూవీ ట్రైలర్..!
