మనీకంట్రోల్ వెల్లడించిన కథనం ప్రకారం.. హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కు మతస్తుల ఆస్తి వారసత్వ వ్యవహారాలను ప్రధానంగా ‘హిందూ వారసత్వ చట్టం – 1956’ (Hindu Succession Act, 1956) నియంత్రిస్తుంది. ఈ చట్టం ప్రకారం, ఒక హిందూ పురుషుడు వీలునామా రాయకుండా మరణిస్తే, అతని ఆస్తిపై మొట్టమొదటి హక్కు ‘మొదటి తరగతి వారసులకు’ (Class I Heirs) వెళుతుంది. ఈ మొదటి తరగతి జాబితాలో మరణించిన వ్యక్తి భార్య, కుమారులు, కుమార్తెలు, తల్లి తదితరులు ఉంటారు. వీరందరికీ ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయి. ఒకవేళ ఈ మొదటి తరగతి వారసులలో ఎవరూ ప్రాణాలతో లేనప్పుడు మాత్రమే, ఆస్తి తదుపరి హక్కుదారులైన ‘రెండవ తరగతి వారసుల’ (Class II Heirs) చేతికి వెళుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
