Last Updated:
Mohan Bhagwat: భారతీయ తత్వశాస్త్రమైన “భిన్నత్వంలో ఏకత్వం”, ప్రవాస భారతీయుల బాధ్యతలు, భౌతిక సుఖాల పరిమితులపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక ప్రసంగం చేశారు.
న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్’ (AHEAD) సంస్థ నిర్వహించిన ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్’ (విశ్వ ఏకత్వ వేడుకలు) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. భారత్, అమెరికా దేశాల మధ్య సారూప్యతలను ప్రస్తావిస్తూ.. రెండు దేశాల డీఎన్ఏలోనే భిన్నత్వం, ఐక్యత ఇమిడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

