Last Updated:
రిఫ్రిజిరేటర్లో నీరు చేరడానికి డోర్ సీల్, ఉష్ణోగ్రత, ఆహార నిల్వ, డ్రెయిన్ లైన్ వంటివి కారణం. సమస్య తీవ్రమైతే నిపుణులను సంప్రదించండి.
రిఫ్రిజిరేటర్ తలుపు తెరిచినప్పుడు షెల్ఫ్‌పై నీటి బిందువులు కనిపిస్తున్నాయా? కూరగాయల ట్రే కింద తరచూ నీరు చేరుతోందా? అయితే దాన్ని చిన్న సమస్యగా తీసుకుని వదిలేయడం మంచిది కాదు. కొంత తేమ సాధారణమే అయినప్పటికీ.. పదేపదే నీరు ఏర్పడటం, షెల్ఫ్‌లు తడిగా మారడం లేదా కింద నీరు నిలవడం వెనుక రిఫ్రిజిరేటర్ పనితీరుకు సంబంధించిన కారణమై ఉండొచ్చని.. విజయనగరానికి చెందిన రీఫ్రిజిరేటర్ నిపుణుడు గణేష్ తెలిపారు. ముఖ్యంగా డోర్ సరిగ్గా సీల్ కాకపోవడం నుంచి డ్రెయిన్ మూసుకుపోవడం వరకు పలు కారణాలు దీనికి దారితీయవచ్చు.

