అక్కా-చెల్లెళ్లు, అన్నదమ్ముల బంధం జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం, ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు గొడవపడటం, మళ్లీ కాసేపటికే కలిసిపోవడం ఈ బంధంలో సహజమే. అయితే వయసు పెరిగే కొద్దీ ఉద్యోగాలు, పెళ్లిళ్లు, కుటుంబ బాధ్యతలు, వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం వంటి కారణాలతో ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. దీంతో చిన్నప్పటి సాన్నిహిత్యం కొంత తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ కొన్ని చిన్న విషయాలను పాటించడం ద్వారా సోదరుల మధ్య ప్రేమ, నమ్మకం, అటాచ్మెంట్‌ను ఎప్పటికీ బలంగా ఉంచుకోవచ్చు.

