ఇందులో శోభిత పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, తన గ్లామర్, నటనతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తోనే ఆ తర్వాత ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘గూఢచారి’, ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి ప్రాజెక్ట్‌లతో స్టార్డమ్ తెచ్చుకుంది శోభిత దూళిపాళ్ల. రీసెంట్గా వచ్చిన ‘యానిమల్’ తరహా ఇంటెన్స్, డార్క్ మూవీస్ ఇష్టపడేవారికి ‘రమన్ రాఘవ్ 2.0’ ఒక పర్ఫెక్ట్ వీకెండ్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
