చక్కెర తింటే డయాబెటిస్ వస్తుందనే భయం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా టీ, స్వీట్లు, కేకులు, బిస్కెట్లు వంటి తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ పెరుగుతుందని భావిస్తారు. అయితే కేవలం తెల్ల చక్కెర తినడం వల్లే నేరుగా డయాబెటిస్ వస్తుందని చెప్పలేం. డయాబెటిస్ రావడానికి అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కుటుంబ చరిత్ర వంటి అనేక కారణాలు ప్రభావం చూపుతాయి.

