Last Updated:
జూలై 20 తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఎంగేజ్మెంట్ భారీగా పెరిగింది. అసలు ఈ భారీ మార్పుకు కారణమేంటి? యువతను ఆకట్టుకునేందుకు మోదీ తీసుకున్న సోషల్ మీడియా వ్యూహం ఏంటి?
Gen-Z ఆధ్వర్యంలో జరిగిన నిరసనల తర్వాత భారత రాజకీయ నేతల సోషల్ మీడియా కార్యకలాపాల్లో గణనీయమైన మార్పు కనిపించినట్లు డేటా అనాలిసిస్ సంస్థ Data Beings వెల్లడించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ పోస్టులకు లభిస్తున్న సగటు ఎంగేజ్మెంట్లో భారీ వృద్ధి నమోదైనట్లు ఆ సంస్థ విశ్లేషణ పేర్కొంది.

