Last Updated:
GIVA Raksha Bandhan Ad Controversy: కృతి సనన్ నటించిన GIVA రక్షాబంధన్ ప్రకటన వివాదంలో చిక్కుకుంది. యాడ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రకటన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే అది ఉద్దేశపూర్వకంగా కాదని స్పష్టం చేస్తూ, వివాదాస్పద యాడ్‌ను అన్ని మాధ్యమాల నుంచి ఉపసంహరించుకుంది.
నటి కృతి సనన్ నటించిన ప్రముఖ జువెలరీ బ్రాండ్ GIVA రక్షాబంధన్ ప్రకటన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రకటనపై సోషల్ మీడియాలో కొంతమంది తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సంస్థ వెనక్కి తగ్గింది. తమ ప్రకటన అనుకోకుండా సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసి ఉంటే అది తమ ఉద్దేశం కాదని GIVA స్పష్టం చేసింది. అంతేకాకుండా వివాదానికి కారణమైన ప్రకటనను అన్ని మాధ్యమాల నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.

