RailONE అనేక రకాల సేవలను అందిస్తుంది కాబట్టి దీనిని “సూపర్ యాప్” అని పిలుస్తారు. దీని ద్వారా మీరు రిజర్వేషన్ టిక్కెట్లు, సాధారణ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రైలు నడుస్తున్న స్థితి (రన్నింగ్ స్టేటస్) , PNR స్థితిని తెలుసుకోవడానికి, కోచ్ స్థానాలను చూడటానికి, ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి , వివిధ రైలు సేవలను పొందడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. రైల్వేకు సంబంధించిన దాదాపు అన్ని పనులను ఈ ఒక్క యాప్ నిర్వహిస్తుంది.
