Last Updated:
ఉదయం నిద్రలేచిన వెంటనే కొంతసేపు ప్రాణాయామం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు రోజును ఉత్సాహంగా ప్రారంభించడంలో సహాయపడవచ్చు. ఒత్తిడి తగ్గించడం, ఏకాగ్రత పెంచడం, శ్వాసపై నియంత్రణ వంటి ప్రాణాయామం ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి.
రోజును ఎలా ప్రారంభిస్తామన్నది మన శారీరక, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత కొంత సమయం ప్రాణాయామం చేయడం మంచి అలవాటుగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. శ్వాసను నియంత్రిస్తూ చేసే యోగ సాధననే ప్రాణాయామం. వివిధ పద్ధతుల్లో శ్వాసను లోపలికి తీసుకోవడం, బయటకు వదలడం ఇందులో ప్రధాన భాగం. రోజూ కొంత సమయం ప్రాణాయామం చేయడం వల్ల ఉదయం ప్రశాంతంగా, ఉత్సాహంగా రోజును ప్రారంభించేందుకు సహాయపడవచ్చు. అయితే ప్రాణాయామం చేసేటప్పుడు సరైన పద్ధతిని, మన శారీరక సామర్థ్యాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.

