వేసవిలో ఎక్కువసేపు ఎండలో గడపడం వల్ల చర్మం నల్లబడటం, పొడిబారడం, కాంతిని కోల్పోవడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. సన్‌టాన్ సహజంగానే కొంతకాలానికి తగ్గిపోతుంది. అయితే కొన్ని సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు చర్మానికి ఉపశమనం కలిగించడమే కాకుండా, టాన్‌ను తగ్గించి చర్మాన్ని మళ్లీ తాజాగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ ఫేస్‌ప్యాక్‌లు చర్మానికి తగిన తేమను అందించి, సూర్యకిరణాల వల్ల కలిగిన దెబ్బను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

