Last Updated:
భర్త చనిపోయాడు.. భార్య ఇల్లు వదిలి మరో వ్యక్తితో వెళ్లిపోయింది. మరి ఆమెకు భర్త ఆస్తిలో ఉన్న హక్కు ఏమవుతుంది? కొడుకు, కూతుళ్లు ఆమె వాటాను తీసేసుకోవచ్చా? ఆమెకు వచ్చిన ఆస్తిని పిల్లలకు కాకుండా వేరే వ్యక్తికి ఇవ్వగలదా? ఇల్లు వదిలి వెళ్లడం వల్లే ఆస్తి హక్కు పోతుందా? హిందూ వారసత్వ చట్టం ఏం చెబుతుందో ఈ కథనంలో తెలుసుకోండి.
భర్త మరణించిన తర్వాత భార్య ఇల్లు వదిలి మరో వ్యక్తితో వెళ్లిపోతే ఆమెకు భర్త ఆస్తిలో ఉన్న హక్కు ఏమవుతుంది? పిల్లలు ఆమెకు తెలియకుండా ఆస్తిని పంచుకోవచ్చా? ఒకవేళ భార్యకు చట్టబద్ధంగా వాటా వస్తే దాన్ని పిల్లలకు కాకుండా మరొకరికి ఇవ్వగలదా? ఇలాంటి ప్రశ్నలు అనేక కుటుంబాల్లో తలెత్తుతుంటాయి. హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం సాధారణంగా వీటికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే ఆస్తి స్వభావం, వీలునామా, ఇతర వారసుల ఉనికి వంటి అంశాలను బట్టి తుది నిర్ణయం మారవచ్చు.

