ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం ఆరు సినిమాల్లో నటించిన ఈ చిన్నారికి మంచి అనుభవం ఉంది. చిన్న వయసులోనే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, కన్నడ కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, ఇప్పుడు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించడం తన అదృష్టమని పేర్కొంది.
