Honda Shine 100:(హోండా షైన్-100)ఈ బైక్ ఎక్స్-షోరూమ్ రూ.65,642 ప్రారంభ ధరతో లభించే కంఫర్ట్, నమ్మకమైన కమ్యూటర్ బైక్. ఇది దృఢమైన ఛాసిస్, పొడవైన , సౌకర్యవంతమైన సీటు, క్లాసిక్ గ్రాఫిక్స్‌తో సహా సరళమైన ఇంకా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఫీచర్ల పరంగా ఇది ప్రాథమిక అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ సెన్సార్, హాలోజన్ హెడ్‌లైట్, మెరుగైన భద్రత కోసం కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో వస్తుంది. ఈ బైక్ రోజువారీ ప్రయాణాలకు, ఉద్యోగ నిపుణులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
