Semiconductor Hub: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. సెమీకండక్టర్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్.. రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఓకే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Semiconductor Hub: భవిష్యత్ సాంకేతికతకు అత్యంత కీలకమైన సెమీకండక్టర్ డిజైన్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వేశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్‌లతో సీఎం చంద్రబాబు
కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్‌లతో సీఎం చంద్రబాబు

ఒకరోజు పర్యటన నిమిత్తం జాతీయ రాజధాని దిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక వసతులు, కీలక రైల్వే ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో సీఎం సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో నూతన సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సెమీకండక్టర్ డిజైనింగ్, పరిశోధన మరియు అభివృద్ధి (R&D), స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ, సామర్థ్య పెంపు వంటి అంశాల్లో కేంద్రం చేయూతనివ్వాలని ఆయన కోరారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి అవసరమైన అధునాతన మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రానికి భాగస్వామ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు లభిస్తాయని హామీ ఇచ్చారు.

రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించి సుమారు రూ. 10,047 కోట్ల వ్యయంతో కూడిన కీలక ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు రైల్వే మంత్రి ముందుంచారు.

1. రూ. 3,197 కోట్ల అంచనాతో విజయవాడ బైపాస్ లైన్ నిర్మాణం

2. రూ. 2,860 కోట్ల వ్యయంతో కొవ్వూరు – భద్రాచలం రైల్వే ప్రాజెక్టు

3. రూ. 2,190 కోట్లతో అనకాపల్లి – కొత్తవలస బైపాస్ ప్రాజెక్టు

4. రూ. 1,800 కోట్ల అంచనా వ్యయంతో ఒంగోలు – దొనకొండ రైల్వే లైన్ పనులు

5. అమరావతి, విశాఖపట్నం నగరాల మధ్య అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వీలుగా హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలును నడపాలని సీఎం చేసిన విజ్ఞప్తికి కేంద్రమంత్రి అంగీకారం తెలిపారు. అంతేకాకుండా, విశాఖపట్నం – తిరుపతి మధ్య పగటిపూట ప్రత్యేక సీటింగ్ సౌకర్యంతో కూడిన మరో రైలును ప్రవేశపెట్టేందుకు సమ్మతిని తెలియజేశారు. కొత్తగా నిర్మించిన కనిగిరి – విజయవాడ రైల్వే మార్గంలో ప్రయాణికుల సేవలు వెంటనే ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పరుగులు పెట్టించే క్రమంలో సరకు రవాణాను సులభతరం చేసేందుకు తొమ్మిది పోర్టులకు అనుసంధానించే రైల్వే కనెక్టివిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయం, గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై వారు 40 నిమిషాల పాటు చర్చించారు. సెమీకండక్టర్ డిజైన్, ఏఐ మరియు రైల్వే రంగాల్లో కేంద్రం ఇచ్చిన ఈ హామీలు రాష్ట్రాన్ని సరికొత్త పారిశ్రామిక మైలురాయి దిశగా నడిపించనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 October 2026, 5:35 am Digital Edition : Prabhanews
Semiconductor Hub: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. సెమీకండక్టర్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్.. రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఓకే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Oct 25, 2026 5:03 AM ISTSemiconductor Hub: భవిష్యత్ సాంకేతికతకు అత్యంత కీలకమైన సెమీకండక్టర్ డిజైన్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వేశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్‌లతో సీఎం చంద్రబాబుఒకరోజు పర్యటన నిమిత్తం జాతీయ రాజధాని దిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక వసతులు, కీలక రైల్వే ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో సీఎం సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో నూతన సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సెమీకండక్టర్ డిజైనింగ్, పరిశోధన మరియు అభివృద్ధి (R&D), స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ, సామర్థ్య పెంపు వంటి అంశాల్లో కేంద్రం చేయూతనివ్వాలని ఆయన కోరారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి అవసరమైన అధునాతన మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రానికి భాగస్వామ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు లభిస్తాయని హామీ ఇచ్చారు.రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించి సుమారు రూ. 10,047 కోట్ల వ్యయంతో కూడిన కీలక ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు రైల్వే మంత్రి ముందుంచారు.1. రూ. 3,197 కోట్ల అంచనాతో విజయవాడ బైపాస్ లైన్ నిర్మాణం2. రూ. 2,860 కోట్ల వ్యయంతో కొవ్వూరు - భద్రాచలం రైల్వే ప్రాజెక్టు3. రూ. 2,190 కోట్లతో అనకాపల్లి - కొత్తవలస బైపాస్ ప్రాజెక్టు4. రూ. 1,800 కోట్ల అంచనా వ్యయంతో ఒంగోలు - దొనకొండ రైల్వే లైన్ పనులు5. అమరావతి, విశాఖపట్నం నగరాల మధ్య అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వీలుగా హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటుప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలును నడపాలని సీఎం చేసిన విజ్ఞప్తికి కేంద్రమంత్రి అంగీకారం తెలిపారు. అంతేకాకుండా, విశాఖపట్నం - తిరుపతి మధ్య పగటిపూట ప్రత్యేక సీటింగ్ సౌకర్యంతో కూడిన మరో రైలును ప్రవేశపెట్టేందుకు సమ్మతిని తెలియజేశారు. కొత్తగా నిర్మించిన కనిగిరి - విజయవాడ రైల్వే మార్గంలో ప్రయాణికుల సేవలు వెంటనే ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పరుగులు పెట్టించే క్రమంలో సరకు రవాణాను సులభతరం చేసేందుకు తొమ్మిది పోర్టులకు అనుసంధానించే రైల్వే కనెక్టివిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయం, గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై వారు 40 నిమిషాల పాటు చర్చించారు. సెమీకండక్టర్ డిజైన్, ఏఐ మరియు రైల్వే రంగాల్లో కేంద్రం ఇచ్చిన ఈ హామీలు రాష్ట్రాన్ని సరికొత్త పారిశ్రామిక మైలురాయి దిశగా నడిపించనున్నాయి.మరింత చదవండి

Source link