Last Updated:
భారత టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి రంగం సిద్ధమవుతోంది. ఎలాంటి సిగ్నల్ టవర్లు లేకుండానే నేరుగా మీ మొబైల్‌కే హైస్పీడ్ ఇంటర్నెట్ వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అసలు ఎలాన్ మస్క్ ప్లాన్ ఏంటి? ఈ సర్వీసులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయో ఇక్కడ తెలుసుకోండి!
ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్‌లింక్’ భారత్‌లోకి ప్రవేశించేందుకు మరోసారి వేగంగా పావులు కదుపుతోంది. దేశంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన తుది అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సరికొత్త దరఖాస్తును సమర్పించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. భద్రతా కారణాలు, విదేశాల్లో అనుమతులు లేని ప్రాంతాల్లో స్టార్‌లింక్ పరికరాల వినియోగంపై వచ్చిన వార్తల కారణంగా ఇప్పటివరకు ఈ ప్రక్రియలో పలు జాప్యాలు చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా జెన్-2 శాటిలైట్ నెట్వర్క్ అనుమతుల కోసం సంస్థ దరఖాస్తు చేసింది.

