Last Updated:
క్రెడిట్ కార్డుకు ఏడాదికి రూ.500, రూ.2,000 లేదా రూ.10,000 ఫీజు చెల్లిస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నారో.. లేక ఫీజు కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారో ఒక చిన్న లెక్కతో తెలుసుకోవచ్చు.
క్రెడిట్ కార్డుకు ఏడాదికి రూ.500, రూ.2,000 లేదా ఏకంగా రూ.10,000 వరకు వార్షిక ఫీజు చెల్లించాల్సి వస్తే చాలామందికి అది అనవసర ఖర్చులా అనిపిస్తుంది. మార్కెట్‌లో వార్షిక ఫీజు లేని కార్డులు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఫ్రీ క్రెడిట్ కార్డే ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్ అని చెప్పలేం. మీరు చెల్లించే ఫీజుతో పోలిస్తే కార్డు ద్వారా నిజంగా పొందుతున్న ప్రయోజనాలు ఎంత విలువైనవో చూడటం ముఖ్యం.

