సాయంత్రం కాగానే చాలామందికి ఏదైనా కరకరలాడే లేదా రుచికరమైన పదార్థం తినాలనిపిస్తుంది. దీంతో సమోసాలు, పకోడీలు, బిస్కెట్లు, ఇతర డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తింటుంటారు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ ఎక్కువ నూనె, ఉప్పు ఉన్న పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు. సాయంత్రం ఆకలికి తేలికపాటి, పోషకమైన స్నాక్స్ కావాలంటే మఖానా, వేయించిన శనగలు, మొక్కజొన్న, మొలకలు వంటి వాటిని ఎంచుకోవచ్చు.

