Last Updated:
పరమాన్నం చేసేటప్పుడు కొందరికి అది గట్టిగా మారడం, మరికొందరికి పాలలో బెల్లం కలిపినప్పుడు పాలు విరిగిపోవడం జరుగుతుంటాయి. సరైన కొలతలు, తయారీ విధానం పాటిస్తే మాత్రం రుచికరమైన పరమాన్నాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.
శ్రావణ మాసం హిందువులకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం వంటి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. పూజల సమయంలో అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. అలాంటి నైవేద్యాల్లో బియ్యం, బెల్లంతో తయారు చేసే బెల్లం పరమాన్నం ఎంతో ప్రత్యేకమైనది. అయితే పరమాన్నం చేసేటప్పుడు కొందరికి అది గట్టిగా మారడం, మరికొందరికి పాలలో బెల్లం కలిపినప్పుడు పాలు విరిగిపోవడం జరుగుతుంటాయి. సరైన కొలతలు, తయారీ విధానం పాటిస్తే మాత్రం రుచికరమైన పరమాన్నాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.

