భారత దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎర్రకోటపై 13వ సారి జెండాను ఎగరేస్తున్న రోజు ఇది. బ్రిటీష్ వారి బానిస సంకెళ్లను తెంచుకొని.. సార్వభౌమత్వ దేశంగా భారత్ ముందుకు సాగుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ.. విజన్ 2047 నాటికి సంపన్న దేశంగా మారాలనే లక్ష్యంతో ముందుకు కదులుతోంది. ప్రతీ సంవత్సరం ఇదే సంకల్పం, పట్టుదలతో భారతీయులంతా కదం తొగ్గుతున్నారు. ముఖ్యంగా యువత.. తమ దేశంలో లోపాల్ని సరిదిద్దుతూ.. భవిష్యత్ భారత్‌ని తీర్చిదిద్దుకుంటున్నారు.
ఈ సందర్భంగా.. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పంద్రాగస్టు వేడుకల్ని లైవ్ అప్డేట్స్లో తెలుసుకుందాం.
