Last Updated:
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
దేశంలో మరోసారి బంగారం ధరల ఆకాశాన్ని తాకుతున్నాయి. జూలై వరకు కూడా నేల చూపులు చూసిన బంగారం ధరలు.. తాజాగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. సిల్వర్ కూడా పరుగులు పెడుతోంది. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్ లాంటిదే. మంగళవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అటు ఎంసీక్స్.. ఇటు బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ జంప్ నమోదైంది.

