Custard Apple: శీతాకాలంలో లభించే అత్యంత రుచికరమైన, పోషకాలు కలిగిన పండ్లలో సీతాఫలం ఒకటి. విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం, ఫైబర్ సమృద్ధిగా ఉండే ఈ పండు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. అయితే, రుచికి తియ్యగా ఉందని సీతాఫలాలను పరిమితికి మించి అతిగా తింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ సీనియర్ డైటీషియన్ డాక్టర్ ఎస్. స్వాతి హెచ్చరిస్తున్నారు.

