దంతవైద్యుడు అంకిత్ చెప్పినదాని ప్రకారం లవంగంలో యూజినాల్ (Eugenol) అనే ముఖ్యమైన క్రియాశీల పదార్థం ఉంటుంది. ఇది సహజమైన నొప్పి నివారిణిగా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పనిచేస్తుంది. దీంతో పంటి నొప్పి, చిగుళ్ల అసౌకర్యం వంటి సమస్యల్లో తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు. లవంగంలో యూజెనైల్ అసిటేట్, బీటా కెరియోఫైలీన్, గాలిక్ యాసిడ్, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, ట్రైటర్పెనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కూడా ఉంటాయి.
