భారత్లోని వివిధ భాషల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాంసంగ్ గెలాక్సీ ఏఐ భాషా సామర్థ్యాలను కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం హిందీ, గుజరాతీ మాట్లాడే వినియోగదారులు కంపెనీ ఫోన్లోనే పనిచేసే ఏఐ టెక్నాలజీ ఆధారంగా కాల్ అసిస్ట్, ఇంటర్ప్రెటర్ వంటి ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. “గెలాక్సీ ఏఐ భాషా పరిధిని మరింత విస్తరించే పనిలో కూడా మేము ఉన్నాం” అని పీటీఐ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్క్ చెప్పారు. భారతీయ భాషలకు సంబంధించిన ఏఐ ఫీచర్ల అభివృద్ధిలో, వాటి పనితీరు మెరుగుపరచడంలో నోయిడా, బెంగళూరులోని సాంసంగ్ పరిశోధనా కేంద్రాలు కీలక పాత్ర పోషించాయని పార్క్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)

