ప్రభన్యూస్

Stock Market Timings: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. రేపటి నుంచి ట్రేడింగ్ టైమింగ్స్‌లో కీలక మార్పులు | బిజినెస్


Last Updated:

SEBI New Trading Rules: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే పెట్టుబడిదారులు, ముఖ్యంగా F&O ట్రేడర్లకు కీలక అప్‌డేట్. మార్కెట్‌లో ధరల నిర్ణయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొత్త ట్రేడింగ్ నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. దీంతో ఆగస్టు 3 నుంచి F&O అర్హత కలిగిన షేర్ల ట్రేడింగ్ సమయాలు, క్లోజింగ్ విధానంలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.

News18
News18

భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ నిర్వహణకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ధరల నిర్ణయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ట్రేడింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో సవరించిన ట్రేడింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను అమల్లోకి తీసుకువస్తోంది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 3, సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ముఖ్యంగా F&O (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్)కు అర్హత కలిగిన షేర్ల ట్రేడింగ్ సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ఇప్పటి వరకు ఈక్విటీ క్యాష్ మార్కెట్‌లో సాధారణ ట్రేడింగ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ముగిసేది. అయితే కొత్త విధానం ప్రకారం F&O-అర్హత కలిగిన (Category-I) షేర్ల కోసం ప్రత్యేకంగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (Closing Auction Session – CAS)ను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ట్రేడింగ్ ముగిసే సమయంలో షేర్‌కు మరింత న్యాయమైన, పారదర్శకమైన ముగింపు ధర (Closing Price) నిర్ణయించడమే ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఇండెక్స్‌లు, ETFలు, పాసివ్ ఫండ్లు, పెద్ద పెట్టుబడిదారులకు ఈ మార్పు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.

కొత్త షెడ్యూల్ ప్రకారం F&O-అర్హత కలిగిన షేర్లలో సాధారణ ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటల వరకు మాత్రమే కొనసాగుతుంది. అనంతరం 3:15 నుంచి 3:20 గంటల వరకు ఐదు నిమిషాల పరివర్తన (Transition) సమయం ఉంటుంది. ఈ సమయంలో ట్రేడింగ్ వ్యవస్థ క్లోజింగ్ ఆక్షన్‌కు సిద్ధమవుతుంది. ఆ తర్వాత 3:20 నుంచి 3:25 గంటల వరకు CAS Order Entry-I ప్రారంభమవుతుంది. ఈ దశలో పెట్టుబడిదారులు కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లను నమోదు చేయవచ్చు. అనంతరం 3:25 నుంచి 3:30 గంటల వరకు CAS Order Entry-II కొనసాగుతుంది. ఈ రెండో దశలో ఇప్పటికే ఇచ్చిన మార్కెట్ ఆర్డర్లను సవరించడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదు. అలాగే మార్కెట్ మానిప్యులేషన్‌ను అరికట్టేందుకు ఈ దశ చివరి రెండు నిమిషాల్లో సెషన్ యాదృచ్ఛికంగా (Random Close) ముగిసే విధంగా SEBI నిబంధనలు రూపొందించింది.

మధ్యాహ్నం 3:30 నుంచి 3:35 గంటల వరకు ఆర్డర్ల మ్యాచింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లను సరిపోల్చి తుది వేలం ధర (Auction Price) నిర్ణయిస్తారు. ఈ వేలం ద్వారా నిర్ణయించిన ధరనే ఆ రోజు F&O-అర్హత కలిగిన షేర్ల అధికారిక ముగింపు ధరగా పరిగణిస్తారు. దీంతో చివరి నిమిషాల్లో జరిగే అసాధారణ ధరల మార్పులు తగ్గి, మార్కెట్ మరింత పారదర్శకంగా పనిచేసే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మార్పులు అన్ని షేర్లకు వర్తించవు. F&O-లో లేని సాధారణ ఈక్విటీ క్యాష్ స్టాక్‌లకు ప్రస్తుతం అమలులో ఉన్న ట్రేడింగ్ సమయాల్లో ఎలాంటి మార్పు లేదు. అలాంటి షేర్ల ట్రేడింగ్ మునుపటిలాగే మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది.

మరోవైపు, ఈక్విటీ డెరివేటివ్స్ (F&O) సెగ్మెంట్ ట్రేడింగ్ సమయాన్ని SEBI 10 నిమిషాలు పొడిగించింది. ఇప్పటి వరకు 3:30 గంటలకు ముగిసే F&O ట్రేడింగ్ ఇకపై మధ్యాహ్నం 3:40 గంటల వరకు కొనసాగుతుంది. దీంతో క్లోజింగ్ ఆక్షన్‌లో ఏర్పడిన తుది ధరలను పరిగణనలోకి తీసుకుని ట్రేడర్లు తమ డెరివేటివ్స్ పొజిషన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇతర మార్కెట్ విభాగాల ట్రేడింగ్ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. SEBI ప్రీ-ఓపెన్ సెషన్‌లో కూడా కొన్ని సవరణలు చేసింది. ఇకపై ఉదయం 9:00 నుంచి 9:07 గంటల వరకు ఆర్డర్ ఎంట్రీ అవకాశం ఉంటుంది. అనంతరం 9:07 నుంచి 9:15 గంటల వరకు ఆర్డర్ల మ్యాచింగ్ జరుగుతుంది. సాధారణ ట్రేడింగ్ మాత్రం మునుపటిలాగే ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి: RBI MPC Meeting: హోం లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి బిగ్ అలర్ట్.. వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం?

ఈ కొత్త విధానం వెనుక ప్రధాన ఉద్దేశం మార్కెట్‌లో మరింత పారదర్శకతను తీసుకురావడమేనని SEBI స్పష్టం చేసింది. వేలం విధానం ద్వారా న్యాయమైన ముగింపు ధర నిర్ణయించడం, లిక్విడిటీని ఒకే చోట సమీకరించడం, పెద్ద పెట్టుబడిదారులు మరియు చిన్న పెట్టుబడిదారులకు సమాన అవకాశాలు కల్పించడం, ఇండెక్స్ ఫండ్లు మరియు ETFల ట్రాకింగ్ లోపాలను తగ్గించడం, అలాగే భారత స్టాక్ మార్కెట్‌ను ప్రపంచంలోని ప్రముఖ మార్కెట్ల ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానున్న కొత్త ట్రేడింగ్ సమయాలను పెట్టుబడిదారులు, ట్రేడర్లు ముందుగానే తెలుసుకుని తమ ట్రేడింగ్ వ్యూహాలను అందుకు అనుగుణంగా మార్చుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 August 2026, 6:31 pm Digital Edition : Prabhanews
Stock Market Timings: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. రేపటి నుంచి ట్రేడింగ్ టైమింగ్స్‌లో కీలక మార్పులు | బిజినెస్

Last Updated:Aug 02, 2026 6:30 PM ISTSEBI New Trading Rules: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే పెట్టుబడిదారులు, ముఖ్యంగా F&O ట్రేడర్లకు కీలక అప్‌డేట్. మార్కెట్‌లో ధరల నిర్ణయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొత్త ట్రేడింగ్ నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. దీంతో ఆగస్టు 3 నుంచి F&O అర్హత కలిగిన షేర్ల ట్రేడింగ్ సమయాలు, క్లోజింగ్ విధానంలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.
News18భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ నిర్వహణకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ధరల నిర్ణయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ట్రేడింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో సవరించిన ట్రేడింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను అమల్లోకి తీసుకువస్తోంది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 3, సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ముఖ్యంగా F&O (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్)కు అర్హత కలిగిన షేర్ల ట్రేడింగ్ సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.ఇప్పటి వరకు ఈక్విటీ క్యాష్ మార్కెట్‌లో సాధారణ ట్రేడింగ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ముగిసేది. అయితే కొత్త విధానం ప్రకారం F&O-అర్హత కలిగిన (Category-I) షేర్ల కోసం ప్రత్యేకంగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (Closing Auction Session - CAS)ను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ట్రేడింగ్ ముగిసే సమయంలో షేర్‌కు మరింత న్యాయమైన, పారదర్శకమైన ముగింపు ధర (Closing Price) నిర్ణయించడమే ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఇండెక్స్‌లు, ETFలు, పాసివ్ ఫండ్లు, పెద్ద పెట్టుబడిదారులకు ఈ మార్పు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.కొత్త షెడ్యూల్ ప్రకారం F&O-అర్హత కలిగిన షేర్లలో సాధారణ ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటల వరకు మాత్రమే కొనసాగుతుంది. అనంతరం 3:15 నుంచి 3:20 గంటల వరకు ఐదు నిమిషాల పరివర్తన (Transition) సమయం ఉంటుంది. ఈ సమయంలో ట్రేడింగ్ వ్యవస్థ క్లోజింగ్ ఆక్షన్‌కు సిద్ధమవుతుంది. ఆ తర్వాత 3:20 నుంచి 3:25 గంటల వరకు CAS Order Entry-I ప్రారంభమవుతుంది. ఈ దశలో పెట్టుబడిదారులు కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లను నమోదు చేయవచ్చు. అనంతరం 3:25 నుంచి 3:30 గంటల వరకు CAS Order Entry-II కొనసాగుతుంది. ఈ రెండో దశలో ఇప్పటికే ఇచ్చిన మార్కెట్ ఆర్డర్లను సవరించడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదు. అలాగే మార్కెట్ మానిప్యులేషన్‌ను అరికట్టేందుకు ఈ దశ చివరి రెండు నిమిషాల్లో సెషన్ యాదృచ్ఛికంగా (Random Close) ముగిసే విధంగా SEBI నిబంధనలు రూపొందించింది.మధ్యాహ్నం 3:30 నుంచి 3:35 గంటల వరకు ఆర్డర్ల మ్యాచింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లను సరిపోల్చి తుది వేలం ధర (Auction Price) నిర్ణయిస్తారు. ఈ వేలం ద్వారా నిర్ణయించిన ధరనే ఆ రోజు F&O-అర్హత కలిగిన షేర్ల అధికారిక ముగింపు ధరగా పరిగణిస్తారు. దీంతో చివరి నిమిషాల్లో జరిగే అసాధారణ ధరల మార్పులు తగ్గి, మార్కెట్ మరింత పారదర్శకంగా పనిచేసే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మార్పులు అన్ని షేర్లకు వర్తించవు. F&O-లో లేని సాధారణ ఈక్విటీ క్యాష్ స్టాక్‌లకు ప్రస్తుతం అమలులో ఉన్న ట్రేడింగ్ సమయాల్లో ఎలాంటి మార్పు లేదు. అలాంటి షేర్ల ట్రేడింగ్ మునుపటిలాగే మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది.మరోవైపు, ఈక్విటీ డెరివేటివ్స్ (F&O) సెగ్మెంట్ ట్రేడింగ్ సమయాన్ని SEBI 10 నిమిషాలు పొడిగించింది. ఇప్పటి వరకు 3:30 గంటలకు ముగిసే F&O ట్రేడింగ్ ఇకపై మధ్యాహ్నం 3:40 గంటల వరకు కొనసాగుతుంది. దీంతో క్లోజింగ్ ఆక్షన్‌లో ఏర్పడిన తుది ధరలను పరిగణనలోకి తీసుకుని ట్రేడర్లు తమ డెరివేటివ్స్ పొజిషన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇతర మార్కెట్ విభాగాల ట్రేడింగ్ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. SEBI ప్రీ-ఓపెన్ సెషన్‌లో కూడా కొన్ని సవరణలు చేసింది. ఇకపై ఉదయం 9:00 నుంచి 9:07 గంటల వరకు ఆర్డర్ ఎంట్రీ అవకాశం ఉంటుంది. అనంతరం 9:07 నుంచి 9:15 గంటల వరకు ఆర్డర్ల మ్యాచింగ్ జరుగుతుంది. సాధారణ ట్రేడింగ్ మాత్రం మునుపటిలాగే ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతుంది.ఇవి కూడా చదవండి: RBI MPC Meeting: హోం లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి బిగ్ అలర్ట్.. వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం?ఈ కొత్త విధానం వెనుక ప్రధాన ఉద్దేశం మార్కెట్‌లో మరింత పారదర్శకతను తీసుకురావడమేనని SEBI స్పష్టం చేసింది. వేలం విధానం ద్వారా న్యాయమైన ముగింపు ధర నిర్ణయించడం, లిక్విడిటీని ఒకే చోట సమీకరించడం, పెద్ద పెట్టుబడిదారులు మరియు చిన్న పెట్టుబడిదారులకు సమాన అవకాశాలు కల్పించడం, ఇండెక్స్ ఫండ్లు మరియు ETFల ట్రాకింగ్ లోపాలను తగ్గించడం, అలాగే భారత స్టాక్ మార్కెట్‌ను ప్రపంచంలోని ప్రముఖ మార్కెట్ల ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానున్న కొత్త ట్రేడింగ్ సమయాలను పెట్టుబడిదారులు, ట్రేడర్లు ముందుగానే తెలుసుకుని తమ ట్రేడింగ్ వ్యూహాలను అందుకు అనుగుణంగా మార్చుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link