Avore EX లైనప్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. బేస్ మోడల్ EX1 ఎక్స్‌షోరూమ్ ధర ₹1,24,999గా నిర్ణయించారు. మధ్యస్థ వేరియంట్ EX2 ధర ₹1,45,999, ఇక టాప్ స్పెక్, హై-పర్ఫార్మెన్స్ వేరియంట్ EX2S ధర ₹1,69,999గా ప్రకటించారు. డిజైన్ పరంగా Avore EX మస్క్యులర్, ఏరోడైనమిక్, స్పోర్టీ కమ్యూటర్ లుక్‌తో రూపొందించారు. సిగ్నేచర్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్, షార్ప్ బాడీ ప్యానెల్స్, స్లీక్ టెయిల్ సెక్షన్ బైక్‌కు ప్రీమియం రూపాన్ని అందిస్తున్నాయి. ముందుభాగంలో ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌తో పాటు సిగ్నేచర్ ట్యాంక్ లైటింగ్‌ను అందించారు. ఎర్గోనామిక్ సీటింగ్, అలాయ్ వీల్స్ కారణంగా రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా ఈ బైక్‌ను రూపొందించారు.

