పూజా హెగ్డే అటు బాలీవుడ్, ఇటు సౌత్ సినిమాల్లో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నేళ్లలోనే స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్‌లు కొట్టేసింది. తెలుగులో జూనియన్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి యంగ్ హీరోలకు జోడీగా చేసింది. హిందీలో రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాప్ హీరోలతో పని చేసినా, ఆమె కెరీర్ గ్రాఫ్ పెద్దగా పెరగలేదు.

