సికింద్రాబాద్ నుంచి రాజ్కోట్ (22718) వెళ్లే ఎక్స్ప్రెస్ జులై 25, 27 తేదీల్లో దౌండ్, మన్మాడ్, జల్గావ్, పల్ది, సూరత్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. కోయంబత్తూర్ నుంచి రాజ్కోట్ (16614) వెళ్లే రైలు జులై 24న ఇదే మార్గంలో నడుస్తుందని అధికారులు వివరించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి. ఎల్టీటీ ముంబై నుంచి విశాఖపట్నం (18520) వచ్చే రైలు జులై 25 నుంచి 28 వరకు, ఎల్టీటీ ముంబై నుంచి కారైకల్ (11017) వెళ్లే రైలు జులై 25న కల్యాణ్, ఇగత్పురి, మన్మాడ్, దౌండ్, సోలాపూర్ మీదుగా దారి మళ్లించారు.

