Last Updated:
Apple: ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం ‘యాపిల్’ (Apple) తమ వినియోగదారులకు వరుస షాక్‌లు ఇస్తోంది. మ్యూజిక్ లైసెన్సింగ్ ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని యాపిల్ వెల్లడించింది.
ఇటీవలె తన హార్డ్‌వేర్ ఉత్పత్తులైన మ్యాక్‌బుక్ (MacBook), ఐప్యాడ్ (iPad)ల ధరలను భారీగా పెంచిన యాపిల్ కంపెనీ.. తాజాగా తన పాపులర్ డిజిటల్ సేవలైన ‘యాపిల్ మ్యూజిక్’ (Apple Music), ‘యాపిల్ వన్’ (Apple One) సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను కూడా పెంచేసింది. మ్యూజిక్ లైసెన్సింగ్ ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని యాపిల్ వెల్లడించింది. ఈ పెరిగిన కొత్త ధరలు ఇప్పటికే యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అయ్యాయి. ఈ పెంపుతో వ్యక్తిగత, ఫ్యామిలీ, స్టూడెంట్ ప్లాన్లు వాడుతున్న యూజర్లపై అదనపు భారం పడనుంది.
యాపిల్ మ్యూజిక్ ప్లాన్లపై నెలకు రూ.10 నుండి రూ.50 వరకు ధరలు పెరిగాయి.
స్టూడెంట్ ప్లాన్: నెలకు రూ.59 గా ఉన్న పాత ధర ఇప్పుడు రూ.69 కి చేరింది.
వ్యక్తిగత ప్లాన్ (Individual): నెలకు రూ.119 గా ఉన్న ధరను రూ.139 కి సవరించారు.
ఫ్యామిలీ ప్లాన్: నెలకు రూ.179 గా ఉన్న ఈ ప్లాన్ ధర ఏకంగా రూ.229 కి పెరిగింది.
యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ+, యాపిల్ న్యూస్+ వంటి పలు సేవలను బండిల్‌గా అందించే యాపిల్ వన్ ప్లాన్ల ధరలను కూడా కంపెనీ మార్చింది.
వ్యక్తిగత ప్లాన్: నెలకు రూ.175 నుంచి రూ.195 కి పెరిగింది.
ఫ్యామిలీ ప్లాన్: నెలకు రూ.235 నుంచి రూ.295 కి సవరించబడింది.
ప్రీమియం ప్లాన్: నెలకు రూ.899 గా ఉన్న ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.995 కి చేరింది.
ఈ ధరల పెంపు కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా అమెరికా, యూరప్ వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోనూ వర్తిస్తుందని యాపిల్ స్పష్టం చేసింది.
Hyderabad,Telangana

