రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుంది?
ఒక పెట్టుబడిదారుడు SCSSలో రూ.5 లక్షలు జమ చేస్తే, సంవత్సరానికి సుమారు రూ.41,000 వరకు వడ్డీ పొందవచ్చు. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) ఖాతాదారుడికి చెల్లిస్తారు. పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఇది మంచి ఎంపికగా భావిస్తారు. అదే రూ.5 లక్షలను పోస్ట్ ఆఫీస్ MISలో పెట్టుబడి పెడితే, ఏడాదికి సుమారు రూ.37,000 వరకు వడ్డీ లభిస్తుంది. అయితే ఈ పథకంలోని ప్రత్యేకత ఏమిటంటే, వడ్డీని ప్రతి నెలా ఖాతాలో జమ చేస్తారు. దీంతో నెలనెలా ఒక స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే, SCSS ద్వారా MISతో పోలిస్తే ఏటా సుమారు రూ.4,000 వరకు అదనపు వడ్డీ లభించే అవకాశం ఉంటుంది.

