ప్రస్తుతం సెల్ఫీ వీడియో సైన్ ఇన్ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్ అకౌంట్లు, చైల్డ్ అకౌంట్లు, అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో ఉన్న గూగుల్ అకౌంట్లకు అందుబాటులో లేదు. అలాగే ఈ ఫీచర్‌ను గూగుల్ దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది. అందుకే దేశం, అకౌంట్ రకాన్ని బట్టి ఈ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశం మారవచ్చు. మీరు వద్దనుకున్నప్పుడు సెల్ఫీ వీడియోను డిలీట్ చేయవచ్చు. మీ గూగుల్ అకౌంట్లోని సెల్ఫీ వీడియో పేజీకి వెళ్లి “డిలీట్” ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఎప్పుడైనా ఈ వీడియోను తొలగించవచ్చు. అయితే సెల్ఫీ వీడియోను డిలీట్ చేస్తే, ఇకపై దాన్ని సైన్ ఇన్ లేదా అకౌంట్ రికవరీ కోసం ఉపయోగించలేరు. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం, వీడియో తొలగించిన తర్వాత కొంతకాలం భద్రతా కారణాల కోసం లేదా విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంటే ఎక్కువ కాలం వరకు తాత్కాలికంగా దాన్ని ఉంచే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

