ప్రభన్యూస్

దీపతూన్ వివాదం.. విజయ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఆలయ ట్రస్ట్ బోర్డు సస్పెన్షన్! |


Last Updated:

తిరుపరంకుండ్రం కొండపై దీపతూన్ వివాదంలో ఆదేశాలు ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ ట్రస్ట్ బోర్డును సస్పెండ్ చేసి, భద్రతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

News18
News18

తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ వివాదంలో తమ నవంబర్ 20 నాటి ఆదేశాలను ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని ఉద్దేశపూర్వక ధిక్కరణగా అభివర్ణించిన ధర్మాసనం, ఇలాంటి పరిస్థితులను ఉక్కుపాదంతో అణచివేయకపోతే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించింది. న్యాయస్థానం ఉత్తర్వులు సంప్రదింపులకు ఆహ్వానం కాదని, తమిళనాడు ప్రభుత్వంతో పాటు అధికారులు, మతపరమైన సంస్థలన్నీ వాటికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

ఉచ్చిపిళ్లయార్ ఆలయ ట్రస్ట్ బోర్డును సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు, ఆలయ పరిపాలన బాధ్యతలను ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తులకు అప్పగించింది. అంతేకాకుండా ఆలయ భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలకు (సీఆర్‌పీఎఫ్) అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద భక్తులందరూ దీపం వెలిగించుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది.

అధికారుల తీరుపై మండిపాటు.. కోర్టు ధిక్కరణ నోటీసులు

తమిళనాడులో, కనీసం మదురై జిల్లాలో పరిపాలనా అరాచకం నెలకొందని అధికారుల ప్రవర్తనను బట్టి అర్థమవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. కోర్టు ఆదేశాలను అమలు చేయబోమని ట్రస్టీలు బహిరంగంగా చెప్పడం తీవ్ర ఉల్లంఘన అని, దీనికి కొందరు అధికారులు సహకరించారని మండిపడింది. మదురై జిల్లా కలెక్టర్, ట్రస్ట్ బోర్డు, దేవాదాయ శాఖ ఛైర్మన్‌పై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. రాజకీయ పెద్దల ఆదేశాలతోనే అధికారులు ఇలా వ్యవహరించారన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, మదురై అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణకు సీఎస్ వ్యక్తిగత హాజరుకు ఆదేశం

సంబంధిత అధికారుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని తమిళనాడు సీఎస్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నవంబర్ 20 నాటి ఉత్తర్వుల అమలును ప్రభావితం చేసేలా ఏవైనా ఆదేశాలు వచ్చాయో లేదో తేల్చేందుకు మెసేజ్‌లు, ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పింది. తదుపరి విచారణకు సీఎస్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

అసలు తిరుపరంకుండ్రం కొండపై ఏం జరిగింది?

మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ (రాతి స్తంభం) వద్ద కార్తీక దీపం వెలిగించే విషయంలో వివాదం నెలకొంది. ఆలయ నిర్వాహకులు అనుమతించిన బృందం అక్కడ దీపం వెలిగించవచ్చని నవంబర్ 20న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే నవంబర్ 24న పోలీసుల రక్షణ మధ్య ఆలయ బృందం రాతి స్తంభం వద్ద కాకుండా, పాత పద్ధతిలోనే ఉచ్చిపిళ్లయార్ ఆలయ సమీపంలోని దీప మండపం వద్ద దీపం వెలిగించింది. ఈ వ్యవహారంపై పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 3:39 pm Digital Edition : Prabhanews
దీపతూన్ వివాదం.. విజయ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఆలయ ట్రస్ట్ బోర్డు సస్పెన్షన్! |

Last Updated:November 27, 2026 3:33 PM ISTతిరుపరంకుండ్రం కొండపై దీపతూన్ వివాదంలో ఆదేశాలు ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ ట్రస్ట్ బోర్డును సస్పెండ్ చేసి, భద్రతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.News18తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ వివాదంలో తమ నవంబర్ 20 నాటి ఆదేశాలను ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని ఉద్దేశపూర్వక ధిక్కరణగా అభివర్ణించిన ధర్మాసనం, ఇలాంటి పరిస్థితులను ఉక్కుపాదంతో అణచివేయకపోతే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించింది. న్యాయస్థానం ఉత్తర్వులు సంప్రదింపులకు ఆహ్వానం కాదని, తమిళనాడు ప్రభుత్వంతో పాటు అధికారులు, మతపరమైన సంస్థలన్నీ వాటికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.ఉచ్చిపిళ్లయార్ ఆలయ ట్రస్ట్ బోర్డును సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు, ఆలయ పరిపాలన బాధ్యతలను ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తులకు అప్పగించింది. అంతేకాకుండా ఆలయ భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలకు (సీఆర్‌పీఎఫ్) అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద భక్తులందరూ దీపం వెలిగించుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది.అధికారుల తీరుపై మండిపాటు.. కోర్టు ధిక్కరణ నోటీసులుతమిళనాడులో, కనీసం మదురై జిల్లాలో పరిపాలనా అరాచకం నెలకొందని అధికారుల ప్రవర్తనను బట్టి అర్థమవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. కోర్టు ఆదేశాలను అమలు చేయబోమని ట్రస్టీలు బహిరంగంగా చెప్పడం తీవ్ర ఉల్లంఘన అని, దీనికి కొందరు అధికారులు సహకరించారని మండిపడింది. మదురై జిల్లా కలెక్టర్, ట్రస్ట్ బోర్డు, దేవాదాయ శాఖ ఛైర్మన్‌పై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. రాజకీయ పెద్దల ఆదేశాలతోనే అధికారులు ఇలా వ్యవహరించారన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, మదురై అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణకు సీఎస్ వ్యక్తిగత హాజరుకు ఆదేశంసంబంధిత అధికారుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని తమిళనాడు సీఎస్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నవంబర్ 20 నాటి ఉత్తర్వుల అమలును ప్రభావితం చేసేలా ఏవైనా ఆదేశాలు వచ్చాయో లేదో తేల్చేందుకు మెసేజ్‌లు, ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పింది. తదుపరి విచారణకు సీఎస్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.అసలు తిరుపరంకుండ్రం కొండపై ఏం జరిగింది?మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ (రాతి స్తంభం) వద్ద కార్తీక దీపం వెలిగించే విషయంలో వివాదం నెలకొంది. ఆలయ నిర్వాహకులు అనుమతించిన బృందం అక్కడ దీపం వెలిగించవచ్చని నవంబర్ 20న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.అయితే నవంబర్ 24న పోలీసుల రక్షణ మధ్య ఆలయ బృందం రాతి స్తంభం వద్ద కాకుండా, పాత పద్ధతిలోనే ఉచ్చిపిళ్లయార్ ఆలయ సమీపంలోని దీప మండపం వద్ద దీపం వెలిగించింది. ఈ వ్యవహారంపై పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.మరింత చదవండి

Source link