ఇకపై హైదరాబాద్ వాటర్ బిల్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లోనే డిజీలాకర్ ద్వారా వాటర్ బిల్‌ను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. అంతేకాదు, అవసరమైనప్పుడు దాన్ని పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని సుమారు 15 లక్షల మంది వాటర్ కనెక్షన్ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీరు అందించడం, మురుగునీటి నిర్వహణ సేవలు కల్పించే సంస్థ. వినియోగదారులు హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వాటర్ బిల్ వివరాలు, బిల్ చెల్లింపుల సమాచారం, ఇతర సేవలను పొందవచ్చు. వాటర్ బిల్లుల్ని డిజీలాకర్ ద్వారా కూడా పొందవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. “హైదరాబాద్ నగరవాసులారా, మీకు నీటి బిల్లు కాపీ కావాలా? హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) పరిధిలోని సుమారు 15 లక్షల మంది వినియోగదారులు, తమ నీటి బిల్లులను ఇకపై ‘డిజిలాకర్’ (DigiLocker) ద్వారా పొందవచ్చు” అని ఎక్స్ పోస్టులో వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)

