ప్రభన్యూస్

Apple Store in Hyderabad: హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్ వచ్చేస్తోంది… డిసెంబర్ 10న ప్రారంభం… ఎక్కడో తెలుసా? | బిజినెస్


Last Updated:

Apple Store in Hyderabad | హైదరాబాద్‌లో ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ నగరంలో తన తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 10న కూకట్‌పల్లిలో ప్రారంభం కానున్న ఈ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌లతో పాటు కంపెనీకి చెందిన పలు ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి.

Apple Store in Hyderabad: హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్ వచ్చేస్తోంది... డిసెంబర్ 10న ప్రారంభం... ఎక్కడో తెలుసా? (image: Apple)
Apple Store in Hyderabad: హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్ వచ్చేస్తోంది… డిసెంబర్ 10న ప్రారంభం… ఎక్కడో తెలుసా? (image: Apple)

హైదరాబాద్‌లో యాపిల్ అభిమానులకు త్వరలో మరో గుడ్ న్యూస్ అందనుంది. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్.. నగరంలో తన తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించబోతోంది. డిసెంబర్ 10 నుంచి ఈ స్టోర్ అందుబాటులోకి రానుంది. దీంతో హైదరాబాద్‌లోని కస్టమర్లకు యాపిల్ ప్రొడక్ట్స్‌ను నేరుగా చూసి కొనుగోలు చేసే అవకాశం లభించనుంది. పీటీఐ (PTI) కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో యాపిల్ తన తొలి స్టోర్‌ను డిసెంబర్ 10న ప్రారంభించనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ స్టోర్‌కు ‘యాపిల్ కూకట్‌పల్లి’ అని పేరు పెట్టారు. ఇది లేక్ షోర్-వై జంక్షన్ మాల్‌లో ఏర్పాటు కానుంది. భారత్‌లో యాపిల్ ప్రారంభించబోతున్న ఏడో రిటైల్ స్టోర్ ఇది. దక్షిణ భారతదేశంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్టోర్ ద్వారా హైదరాబాద్ కస్టమర్లు యాపిల్ ప్రొడక్ట్స్‌ను దగ్గర నుంచి చూసి, వాటి గురించి తెలుసుకుని కొనుగోలు చేయొచ్చు. కంపెనీ అందించే సేవలు, కస్టమర్ సపోర్ట్‌ను కూడా నేరుగా పొందొచ్చు.

ఇది కూడా చదవండి: Gratuity Rule: ఐదేళ్లు పనిచేయకపోయినా గ్రాట్యుటీ వస్తుందా? హైకోర్టు తీర్పు… ఉద్యోగులు తెలుసుకోవాల్సిందే!

2026 మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ సరఫరాలకు సంబంధించి సైబర్‌మీడియా రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 బ్రాండ్లలో యాపిల్ కూడా ఉంది. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్‌కు 9 శాతం వాటా ఉంది. హైదరాబాద్‌లో ఇప్పటికే యాపిల్‌కు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) విభాగం ఉంది. అలాగే రిటైల్ కస్టమర్ కేర్ టీమ్స్ కూడా ఇక్కడే పనిచేస్తున్నాయి. ఇప్పుడు కొత్త స్టోర్ ప్రారంభంతో నగరంలో యాపిల్ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి. యాపిల్ కూకట్‌పల్లి స్టోర్‌లో కంపెనీకి చెందిన పూర్తి స్థాయి ప్రొడక్ట్ లైనప్ అందుబాటులో ఉంటుంది. ఇందులో లేటెస్ట్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ డ్యుయో, ప్రోఎల్‌ఈడీ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, టచ్ ఫీచర్‌తో వచ్చే మ్యాక్‌బుక్ ప్రో, యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ అల్ట్రా 4 వంటి ప్రొడక్ట్స్ ఉంటాయి.

ఇది కూడా చదవండి: Gold Buying: ఇక్కడ దొరికినంత చీప్‌గా బంగారం ఎక్కడా దొరకదు… తులంపై రూ.12 వేలు తక్కువ!

భారత్‌లో ఇప్పటికే ఉన్న యాపిల్ రిటైల్ స్టోర్ల నెట్‌వర్క్‌లో హైదరాబాద్‌లోని కొత్త స్టోర్ కూడా చేరనుంది. ప్రస్తుతం ముంబైలో యాపిల్ బీకేసీ, యాపిల్ బోరివలి స్టోర్లు ఉన్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో యాపిల్ సాకేత్, యాపిల్ నోయిడా స్టోర్లు పనిచేస్తున్నాయి. బెంగళూరులో యాపిల్ హెబ్బల్, పుణెలో యాపిల్ కొరేగావ్ పార్క్ స్టోర్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు యాపిల్ కూకట్‌పల్లి అందుబాటులోకి రానుంది. మొత్తంగా చూస్తే.. హైదరాబాద్‌లో యాపిల్ తొలి స్టోర్ ప్రారంభం కావడం నగరంలోని ఐఫోన్, ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండనుంది. ప్రొడక్ట్స్‌ను నేరుగా పరిశీలించడం, కొనుగోలు చేయడం, కంపెనీ సేవలు పొందడం మరింత సులభం కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 12:35 pm Digital Edition : Prabhanews
Apple Store in Hyderabad: హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్ వచ్చేస్తోంది… డిసెంబర్ 10న ప్రారంభం… ఎక్కడో తెలుసా? | బిజినెస్

Last Updated:November 26, 2026 12:25 PM ISTApple Store in Hyderabad | హైదరాబాద్‌లో ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ నగరంలో తన తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 10న కూకట్‌పల్లిలో ప్రారంభం కానున్న ఈ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌లతో పాటు కంపెనీకి చెందిన పలు ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి.Apple Store in Hyderabad: హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్ వచ్చేస్తోంది... డిసెంబర్ 10న ప్రారంభం... ఎక్కడో తెలుసా? (image: Apple)హైదరాబాద్‌లో యాపిల్ అభిమానులకు త్వరలో మరో గుడ్ న్యూస్ అందనుంది. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్.. నగరంలో తన తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించబోతోంది. డిసెంబర్ 10 నుంచి ఈ స్టోర్ అందుబాటులోకి రానుంది. దీంతో హైదరాబాద్‌లోని కస్టమర్లకు యాపిల్ ప్రొడక్ట్స్‌ను నేరుగా చూసి కొనుగోలు చేసే అవకాశం లభించనుంది. పీటీఐ (PTI) కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో యాపిల్ తన తొలి స్టోర్‌ను డిసెంబర్ 10న ప్రారంభించనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ స్టోర్‌కు 'యాపిల్ కూకట్‌పల్లి' అని పేరు పెట్టారు. ఇది లేక్ షోర్-వై జంక్షన్ మాల్‌లో ఏర్పాటు కానుంది. భారత్‌లో యాపిల్ ప్రారంభించబోతున్న ఏడో రిటైల్ స్టోర్ ఇది. దక్షిణ భారతదేశంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్టోర్ ద్వారా హైదరాబాద్ కస్టమర్లు యాపిల్ ప్రొడక్ట్స్‌ను దగ్గర నుంచి చూసి, వాటి గురించి తెలుసుకుని కొనుగోలు చేయొచ్చు. కంపెనీ అందించే సేవలు, కస్టమర్ సపోర్ట్‌ను కూడా నేరుగా పొందొచ్చు.ఇది కూడా చదవండి: Gratuity Rule: ఐదేళ్లు పనిచేయకపోయినా గ్రాట్యుటీ వస్తుందా? హైకోర్టు తీర్పు... ఉద్యోగులు తెలుసుకోవాల్సిందే!2026 మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ సరఫరాలకు సంబంధించి సైబర్‌మీడియా రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 బ్రాండ్లలో యాపిల్ కూడా ఉంది. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్‌కు 9 శాతం వాటా ఉంది. హైదరాబాద్‌లో ఇప్పటికే యాపిల్‌కు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) విభాగం ఉంది. అలాగే రిటైల్ కస్టమర్ కేర్ టీమ్స్ కూడా ఇక్కడే పనిచేస్తున్నాయి. ఇప్పుడు కొత్త స్టోర్ ప్రారంభంతో నగరంలో యాపిల్ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి. యాపిల్ కూకట్‌పల్లి స్టోర్‌లో కంపెనీకి చెందిన పూర్తి స్థాయి ప్రొడక్ట్ లైనప్ అందుబాటులో ఉంటుంది. ఇందులో లేటెస్ట్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ డ్యుయో, ప్రోఎల్‌ఈడీ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, టచ్ ఫీచర్‌తో వచ్చే మ్యాక్‌బుక్ ప్రో, యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ అల్ట్రా 4 వంటి ప్రొడక్ట్స్ ఉంటాయి.ఇది కూడా చదవండి: Gold Buying: ఇక్కడ దొరికినంత చీప్‌గా బంగారం ఎక్కడా దొరకదు... తులంపై రూ.12 వేలు తక్కువ!భారత్‌లో ఇప్పటికే ఉన్న యాపిల్ రిటైల్ స్టోర్ల నెట్‌వర్క్‌లో హైదరాబాద్‌లోని కొత్త స్టోర్ కూడా చేరనుంది. ప్రస్తుతం ముంబైలో యాపిల్ బీకేసీ, యాపిల్ బోరివలి స్టోర్లు ఉన్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో యాపిల్ సాకేత్, యాపిల్ నోయిడా స్టోర్లు పనిచేస్తున్నాయి. బెంగళూరులో యాపిల్ హెబ్బల్, పుణెలో యాపిల్ కొరేగావ్ పార్క్ స్టోర్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు యాపిల్ కూకట్‌పల్లి అందుబాటులోకి రానుంది. మొత్తంగా చూస్తే.. హైదరాబాద్‌లో యాపిల్ తొలి స్టోర్ ప్రారంభం కావడం నగరంలోని ఐఫోన్, ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండనుంది. ప్రొడక్ట్స్‌ను నేరుగా పరిశీలించడం, కొనుగోలు చేయడం, కంపెనీ సేవలు పొందడం మరింత సులభం కానుంది.మరింత చదవండి

Source link