అయితే, అప్పటికే రమకు వివాహమై, భర్తతో విడాకులు తీసుకుని తన కుమారుడు కార్తికేయతో వేరుగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ రాజమౌళి వెనుకడుగు వేయలేదు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, రమను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కార్తికేయను తన సొంత కుమారుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ పెంచారు. అంతటి పేరు, ప్రఖ్యాతులు, సంపద ఉన్నప్పటికీ రాజమౌళి దంపతులు సొంత పిల్లలను కనకపోవడానికి వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. తమకు మళ్లీ సంతానం కలిగితే, కార్తికేయపై చూపే ప్రేమ, శ్రద్ధ ఎక్కడ తగ్గిపోతుందోనన్న భావనతోనే వారు పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత వారు ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నారు.

