దీనికి ప్రధాన కారణం బంగారం ధరల్లో వచ్చిన హెచ్చుతగ్గులే. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తీవ్రంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఈ ఆరు నెలల కాలంలో మొత్తంగా బంగారం ధరలు తగ్గాయి. ఏప్రిల్లో ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం సగటు ధర సుమారు 4,721 అమెరికన్ డాలర్లుగా ఉంది. సెప్టెంబర్ నాటికి ఇది 4,319 డాలర్లకు పడిపోయింది. అంటే దాదాపు 9 శాతం తగ్గింది. అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం, అమెరికన్ డాలర్ బలపడటం, వడ్డీ రేట్లను మరింత కఠినంగా ఉంచే అవకాశం ఉందన్న అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. సాధారణంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఇన్వెస్టర్లు బంగారంపై ఆసక్తి చూపుతుంటారు. అలాగే తమ పెట్టుబడులను వివిధ మార్గాల్లో విస్తరించుకోవడానికి కూడా బంగారాన్ని ఎంచుకుంటారు. అయినప్పటికీ ఈసారి ధరలు తగ్గడం గమనార్హం. (ప్రతీకాత్మక చిత్రం)

