ప్రభన్యూస్

Women Safety: అర్ధరాత్రి కేఫేలో పార్టీ.. ఒక యువతిని ఆరుగురు ఏం చేశారో తెలుసా.. దారుణం..! |


Last Updated:

ఢిల్లీలోని ప్రీత్ విహార్ కేఫేలో అర్ధరాత్రి పార్టీ తర్వాత 22 ఏళ్ల యువతిపై సహచరులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్త

News18
News18

దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో ఓ కేఫేలో జరిగిన అర్ధరాత్రి పార్టీకి హాజరైన 22 ఏళ్ల యువతి తన సహచరుల చేతిలో సామూహిక లైంగిక దాడికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు, నిందితులు కర్కర్‌డూమాలోని ఓ కేఫేలో పనిచేస్తున్న సహచరులేనని పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నవంబర్ 23 రాత్రి యువతి తన సహచరులతో కలిసి ప్రీత్ విహార్‌లోని కేఫేకు పార్టీ కోసం వెళ్లింది. సాధారణంగా ఆ కేఫే రాత్రి 11.30 గంటలకు మూసివేస్తారు. అయితే అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి వద్ద తాళాలు ఉండటంతో, కేఫే మూసిన తర్వాత కూడా బృందం లోపలే ఉండి పార్టీ కొనసాగించినట్లు సమాచారం. ఈ సమయంలో మద్యం సేవిస్తూ, డ్యాన్స్ చేస్తూ గడిపినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇద్దరు పురుష సహచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, మిగిలిన వారు వారికి సహకరించారని యువతి తన ఫిర్యాదులో ఆరోపించింది.

ఈ ఘటన అనంతరం మంగళవారం తెల్లవారుజామున సుమారు 5.45 గంటలకు బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు సహా ఆరుగురిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు, మెజిస్ట్రేట్ ఎదుట కూడా ఆమె స్టేట్‌మెంట్ తీసుకోనున్నారు.

కేఫేలో పార్టీ పేరుతో జరిగిన ఈ ఘటన ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. తమతో కలిసి పనిచేసే సహచరులే ఈ ఘటనకు పాల్పడ్డారంటూ యువతి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో వెల్లడికానున్నాయి. బాధితురాలి ఆరోపణలు ఇంకా దర్యాప్తులో ఉన్నందున, కేసుకు సంబంధించిన తుది విషయాలు పోలీసుల విచారణ, న్యాయ ప్రక్రియ తర్వాతే స్పష్టమవుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 6:44 pm Digital Edition : Prabhanews
Women Safety: అర్ధరాత్రి కేఫేలో పార్టీ.. ఒక యువతిని ఆరుగురు ఏం చేశారో తెలుసా.. దారుణం..! |

Last Updated:November 25, 2026 6:29 PM ISTఢిల్లీలోని ప్రీత్ విహార్ కేఫేలో అర్ధరాత్రి పార్టీ తర్వాత 22 ఏళ్ల యువతిపై సహచరులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తNews18దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో ఓ కేఫేలో జరిగిన అర్ధరాత్రి పార్టీకి హాజరైన 22 ఏళ్ల యువతి తన సహచరుల చేతిలో సామూహిక లైంగిక దాడికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు, నిందితులు కర్కర్‌డూమాలోని ఓ కేఫేలో పనిచేస్తున్న సహచరులేనని పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. నవంబర్ 23 రాత్రి యువతి తన సహచరులతో కలిసి ప్రీత్ విహార్‌లోని కేఫేకు పార్టీ కోసం వెళ్లింది. సాధారణంగా ఆ కేఫే రాత్రి 11.30 గంటలకు మూసివేస్తారు. అయితే అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి వద్ద తాళాలు ఉండటంతో, కేఫే మూసిన తర్వాత కూడా బృందం లోపలే ఉండి పార్టీ కొనసాగించినట్లు సమాచారం. ఈ సమయంలో మద్యం సేవిస్తూ, డ్యాన్స్ చేస్తూ గడిపినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇద్దరు పురుష సహచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, మిగిలిన వారు వారికి సహకరించారని యువతి తన ఫిర్యాదులో ఆరోపించింది.ఈ ఘటన అనంతరం మంగళవారం తెల్లవారుజామున సుమారు 5.45 గంటలకు బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు సహా ఆరుగురిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు, మెజిస్ట్రేట్ ఎదుట కూడా ఆమె స్టేట్‌మెంట్ తీసుకోనున్నారు.కేఫేలో పార్టీ పేరుతో జరిగిన ఈ ఘటన ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. తమతో కలిసి పనిచేసే సహచరులే ఈ ఘటనకు పాల్పడ్డారంటూ యువతి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో వెల్లడికానున్నాయి. బాధితురాలి ఆరోపణలు ఇంకా దర్యాప్తులో ఉన్నందున, కేసుకు సంబంధించిన తుది విషయాలు పోలీసుల విచారణ, న్యాయ ప్రక్రియ తర్వాతే స్పష్టమవుతాయి.మరింత చదవండి

Source link