Last Updated:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడూ టైమ్ ఇస్తుంటాడు. షూటింగ్స్, సినిమా ప్రమోషన్స్ అంటూ రోజు బిజీ బిజీగా గడిపే బన్నీ.. ఫ్యామిలీతో కలిసి గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడూ టైమ్ ఇస్తుంటాడు. షూటింగ్స్, సినిమా ప్రమోషన్స్ అంటూ రోజు బిజీ బిజీగా గడిపే బన్నీ.. ఫ్యామిలీతో కలిసి గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించిన స్పెషల్ డేస్‌ను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటాడు. రీసెంట్గా తన కూతురు అల్లు అర్హ పదో పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ఏర్పాట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అల్లు అర్హ నవంబర్ 21న తన పదో పుట్టినరోజు జరుపుకుంది. ఈ స్పెషల్ డేను మరింత గుర్తుండిపోయేలా చేయాలని తన ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లాడు. అర్హ పుట్టినరోజు వేడుకలను అక్కడే ఘనంగా నిర్వహించాడు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లల పుట్టినరోజు వేడుకలు అంటే అభిమానుల్లో కూడా ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటిది అల్లు అర్జున్ కుమార్తె పదో పుట్టినరోజు కావడంతో ఈ వేడుకలపై అందరి దృష్టి పడింది.
అర్హ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక ఫోటోను షేర్ చేస్తూ తన కుమార్తెకు విషెస్ తెలిపాడు. ‘జాయ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ తన కుమార్తెపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. ఇక అర్హ పుట్టినరోజు వేడుకల కోసం అల్లు కుటుంబం మొత్తం శ్రీలంకకు చేరుకోవడం విశేషం. కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఈ స్పెషల్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ ఫోటో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్పెషల్ డిన్నర్ చేసినట్లు కనిపించారు. అందరూ కలిసి ఒకే చోట కూర్చుని సరదాగా గడుపుతున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం తన సినిమా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాల మధ్య టైమ్ కేటాయించడం అంత మాములు విషయం కాదు. అయినప్పటికీ పిల్లల బర్త్‌డేస్, అలాగే ఫ్యామిలీలో జరిగే ముఖ్యమైన ఈవెంట్లకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటాడు. స్టార్ హీరోగా ఎంతటి స్థాయిలో ఉన్నా కుటుంబంతో గడిపే క్షణాలకు ఆయన ఇచ్చే విలువ ఈ వేడుకల ద్వారా మరోసారి స్పష్టమవుతోంది.
మొత్తానికి అల్లు అర్హ పదో పుట్టినరోజు వేడుకలు శ్రీలంకలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ప్రత్యేకంగా జరిగాయి. అర్హపై అల్లు అర్జున్ కురిపించిన ప్రేమ, కుటుంబమంతా కలిసి జరుపుకున్న ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమాల ప్రపంచానికి కాస్త దూరంగా కుటుంబంతో గడిపిన ఈ క్షణాలు అల్లు అర్జున్‌కు మరింత ప్రత్యేకంగా నిలిచిపోనున్నాయి.

