Miss Universe 2026 Winner: మిస్ యూనివర్స్ చరిత్రలో సరికొత్త రికార్డు.. పెళ్లై, బిడ్డ ఉన్న మహిళకు కిరీటం.. |


Last Updated:

మిస్ యూనివర్స్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతం చోటుచేసుకుంది. అందాల పోటీల్లో విజేతగా నిలవాలంటే పెళ్లి కాకూడదు, పిల్లలు ఉండకూడదనే పాత నిబంధనలకు కాలం చెల్లింది. ఏకంగా ఒక బిడ్డకు తల్లైన 27 ఏళ్ల మహిళ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె జీవితంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాలేంటి?

News18
News18

మిస్ యూనివర్స్ పోటీల చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది. ఇప్పటివరకు అందాల పోటీల్లో వివాహం, పిల్లలు ఉన్న మహిళలకు అవకాశం విషయంలో ఆంక్షలు ఉండేవి. అయితే ఆ నిబంధనలు మారిన తర్వాత తొలిసారిగా ఓ వివాహిత, ఒక బిడ్డకు తల్లి అయిన మహిళ విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ప్యూర్టో రికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచారు. నవంబర్ 24న ప్యూర్టో రికో రాజధాని శాన్ జువాన్‌లోని కొలిసియో డి ప్యూర్టో రికో జోస్ మిగుయెల్ అగ్రెలాట్ వేదికగా జరిగిన తుది పోటీల్లో 115 మంది అందగత్తెలను వెనక్కి నెట్టి ఆమె ఈ ఘనత సాధించారు.

ఆరోసారి కిరీటం

జెన్నిఫర్ విజయంతో ప్యూర్టో రికోకు ఆరోసారి మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. గతంలో ఈ దేశానికి 1970, 1985, 1993, 2001, 2006 సంవత్సరాల్లో ఈ గౌరవం లభించింది. ఈసారి పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ రెండో రన్నరప్‌గా నిలిచారు.

మోడలింగ్ అనుభవం లేకుండానే విశ్వసుందరి

జెన్నిఫర్ ప్రయాణం కూడా ఎంతో ప్రత్యేకమైనది. గతంలో ఆమెకు మోడలింగ్ రంగంలో ఎలాంటి అనుభవం లేదు. సమాజ సేవలో చురుగ్గా పాల్గొనే ఆమె 2026 ఫిబ్రవరిలో తొలిసారిగా ర్యాంప్‌పై నడిచారు. అదే ఏడాది జూన్‌లో మిస్ యూనివర్స్ ప్యూర్టో రికో టైటిల్‌ను గెలుచుకుని అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు 30 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. తన పట్టుదలతో పాటు కృషితో చివరకు ప్రపంచ స్థాయి కిరీటాన్ని అందుకున్నారు.

రెండు మాస్టర్స్ డిగ్రీలు.. సమాజ సేవలోనూ గుర్తింపు

జెన్నిఫర్ కేవలం అందాల పోటీల విజేత మాత్రమే కాదు.. విద్యాపరంగానూ ప్రత్యేకత చాటుకున్నారు. ఆమె సైకాలజీలో పట్టభద్రురాలు. సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్ విభాగాల్లో రెండు మాస్టర్స్ డిగ్రీలు పొందారు. గతంలో అమెరికా సైనిక విభాగంతో కలిసి పనిచేశారు. గృహ హింస బాధిత మహిళలకు అండగా నిలవడంతో పాటు మానసిక ఆరోగ్యం, చిన్నారులపై వేధింపులు వంటి సమస్యలపై అవగాహన కల్పించారు. యుద్ధాల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు కూడా సహాయం అందించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మిస్ యూనివర్స్ నిబంధనలు ఎప్పుడు మారాయి?

మిస్ యూనివర్స్ పోటీలు 1952లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాంగ్ బీచ్‌లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి సుమారు ఏడు దశాబ్దాల పాటు అవివాహిత మహిళలు, పిల్లలు లేనివారు మాత్రమే పోటీల్లో పాల్గొనే నిబంధన ఉండేది. అంతేకాదు, విజేతలు తమ పదవీకాలంలోనూ వివాహం చేసుకోకూడదనే ఆంక్ష ఉండేది. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకే అవకాశం కల్పించేవారు.

అయితే ఈ నిబంధనలు మహిళల వ్యక్తిగత జీవిత నిర్ణయాలకు అడ్డంకిగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో 2022 ఆగస్టులో మిస్ యూనివర్స్ సంస్థ పాత నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2023 నుంచి వివాహితులు, విడాకులు తీసుకున్నవారు, పిల్లలు ఉన్న మహిళలు కూడా పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. వయసుకు సంబంధించిన గరిష్ఠ పరిమితిని కూడా తొలగించింది. 18 ఏళ్లు నిండిన వయోజన మహిళలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి వివాహితులు పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ, తొలిసారిగా తల్లి అయిన మహిళ విజేతగా నిలవడం జెన్నిఫర్‌తోనే సాధ్యమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 1:42 pm Digital Edition : Prabhanews
Miss Universe 2026 Winner: మిస్ యూనివర్స్ చరిత్రలో సరికొత్త రికార్డు.. పెళ్లై, బిడ్డ ఉన్న మహిళకు కిరీటం.. |

Last Updated:November 25, 2026 1:25 PM ISTమిస్ యూనివర్స్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతం చోటుచేసుకుంది. అందాల పోటీల్లో విజేతగా నిలవాలంటే పెళ్లి కాకూడదు, పిల్లలు ఉండకూడదనే పాత నిబంధనలకు కాలం చెల్లింది. ఏకంగా ఒక బిడ్డకు తల్లైన 27 ఏళ్ల మహిళ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె జీవితంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాలేంటి?
News18మిస్ యూనివర్స్ పోటీల చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది. ఇప్పటివరకు అందాల పోటీల్లో వివాహం, పిల్లలు ఉన్న మహిళలకు అవకాశం విషయంలో ఆంక్షలు ఉండేవి. అయితే ఆ నిబంధనలు మారిన తర్వాత తొలిసారిగా ఓ వివాహిత, ఒక బిడ్డకు తల్లి అయిన మహిళ విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ప్యూర్టో రికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచారు. నవంబర్ 24న ప్యూర్టో రికో రాజధాని శాన్ జువాన్‌లోని కొలిసియో డి ప్యూర్టో రికో జోస్ మిగుయెల్ అగ్రెలాట్ వేదికగా జరిగిన తుది పోటీల్లో 115 మంది అందగత్తెలను వెనక్కి నెట్టి ఆమె ఈ ఘనత సాధించారు.
👑 New Miss Universe 2026: 27-year-old Jennifer Barreto from Puerto Rico!
The big 75th final took place in San Juan. She beat 115 other women and gave Puerto Rico its 6th win ever — the first in 20 years.Jennifer has a psychology degree plus two master’s degrees: in psychology and social work.Since 2021 she worked as a psychologist helping US military families. She supported victims of domestic violence and child abuse.She also made history as the first mom to win the Miss Universe title.— NEXTA (@nexta_tv) November 25, 2026ఆరోసారి కిరీటంజెన్నిఫర్ విజయంతో ప్యూర్టో రికోకు ఆరోసారి మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. గతంలో ఈ దేశానికి 1970, 1985, 1993, 2001, 2006 సంవత్సరాల్లో ఈ గౌరవం లభించింది. ఈసారి పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ రెండో రన్నరప్‌గా నిలిచారు.మోడలింగ్ అనుభవం లేకుండానే విశ్వసుందరిజెన్నిఫర్ ప్రయాణం కూడా ఎంతో ప్రత్యేకమైనది. గతంలో ఆమెకు మోడలింగ్ రంగంలో ఎలాంటి అనుభవం లేదు. సమాజ సేవలో చురుగ్గా పాల్గొనే ఆమె 2026 ఫిబ్రవరిలో తొలిసారిగా ర్యాంప్‌పై నడిచారు. అదే ఏడాది జూన్‌లో మిస్ యూనివర్స్ ప్యూర్టో రికో టైటిల్‌ను గెలుచుకుని అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు 30 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. తన పట్టుదలతో పాటు కృషితో చివరకు ప్రపంచ స్థాయి కిరీటాన్ని అందుకున్నారు.రెండు మాస్టర్స్ డిగ్రీలు.. సమాజ సేవలోనూ గుర్తింపుజెన్నిఫర్ కేవలం అందాల పోటీల విజేత మాత్రమే కాదు.. విద్యాపరంగానూ ప్రత్యేకత చాటుకున్నారు. ఆమె సైకాలజీలో పట్టభద్రురాలు. సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్ విభాగాల్లో రెండు మాస్టర్స్ డిగ్రీలు పొందారు. గతంలో అమెరికా సైనిక విభాగంతో కలిసి పనిచేశారు. గృహ హింస బాధిత మహిళలకు అండగా నిలవడంతో పాటు మానసిక ఆరోగ్యం, చిన్నారులపై వేధింపులు వంటి సమస్యలపై అవగాహన కల్పించారు. యుద్ధాల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు కూడా సహాయం అందించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.మిస్ యూనివర్స్ నిబంధనలు ఎప్పుడు మారాయి?మిస్ యూనివర్స్ పోటీలు 1952లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాంగ్ బీచ్‌లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి సుమారు ఏడు దశాబ్దాల పాటు అవివాహిత మహిళలు, పిల్లలు లేనివారు మాత్రమే పోటీల్లో పాల్గొనే నిబంధన ఉండేది. అంతేకాదు, విజేతలు తమ పదవీకాలంలోనూ వివాహం చేసుకోకూడదనే ఆంక్ష ఉండేది. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకే అవకాశం కల్పించేవారు.అయితే ఈ నిబంధనలు మహిళల వ్యక్తిగత జీవిత నిర్ణయాలకు అడ్డంకిగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో 2022 ఆగస్టులో మిస్ యూనివర్స్ సంస్థ పాత నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2023 నుంచి వివాహితులు, విడాకులు తీసుకున్నవారు, పిల్లలు ఉన్న మహిళలు కూడా పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. వయసుకు సంబంధించిన గరిష్ఠ పరిమితిని కూడా తొలగించింది. 18 ఏళ్లు నిండిన వయోజన మహిళలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి వివాహితులు పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ, తొలిసారిగా తల్లి అయిన మహిళ విజేతగా నిలవడం జెన్నిఫర్‌తోనే సాధ్యమైంది.మరింత చదవండి

Source link